అతిధి@అరవై
అతిధి @ అరవై. సాయంకాలం నాలుగు గంటలు అయింది. నీలిరంగు ఆకాశం హఠాత్తుగా రంగు మారిపోయింది. వరుణ దేవుడు వాయుదేవుడు ఇద్దరూ రంగంలోకి దిగారు. పెద్ద వర్షం కాదు గాని చిన్న చిన్న తుంపర్లతో రహదారంతా తడిసిపోయింది. ఇంతలో స్కూటర్ వచ్చి ఆగింది . ఎవరబ్బా ఈ వర్షం లో అని తొంగి చూశాడు కుర్చీలో కూర్చున్న ప్రసాద్. స్కూటర్ స్టాండ్ వేస్తూ రామారావు వెనకాల అతను భార్య సుజాత కనబడ్డారు. వీధిలోకి వెళ్లి ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించాడు ప్రసాద్. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ప్రసాద్ స్నేహితుడు రామారావు "ఒరేయ్ ప్రసాదు రేపు ఉదయం 9 గంటలకి మా అమ్మాయి శ్రీమంతం నువ్వు మీ ఆవిడ తప్పకుండా రావాలి ! అంటూ చెప్పాడు. కాఫీ టిఫిను భోజనం కూడా అక్కడే అంటూ ఆప్యాయంగా చెప్పాడు రామారావు. "నేనెందుకు రా ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా నేనేం చేయను వచ్చి అంటూ పకపక నవ్వేడు ప్రసాద్. "లేదురా నువ్వు తప్పకుండా రావాలి. మీలాంటి దంపతులు వచ్చి మా పిల్లనీ ఆశీర్వదించాలి అంటూ సెంటిమెంట్ గా చెప్పాడు ఇంతలో రామారావు భార్య సుజాత అన్నయ్య గారు వదిన గారు లేరా ! అని ప్రశ్నించింది . లేదమ్మా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది అంటూ చెప్పాడు ప్రసాద్. రాత్ర...