పోస్ట్‌లు

బహు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

బహుమతి

బహుమతి " నాన్న అమ్మ బర్తడే దగ్గరకు వచ్చేస్తుంది. అమ్మకి ఇది స్పెషల్ బర్తడే. అరవై సంవత్సరాలు వస్తున్నాయి. ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వు నాన్న అంటూ విదేశాల్లో ఉంటున్న రామారావు పిల్లలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేస్తూ హడావుడి చేస్తున్నారు రెండు రోజుల నుంచి. ఏం గిఫ్ట్ ఇవ్వాలి ?ఎంత ఆలోచించినా రామారావుకి ఏమి ఆలోచన తట్టలేదు. వెండి బంగారాల మీద మమకారం లేదు రామారావు భార్య సీతాదేవి కి. ఖరీదైన పట్టు చీరలు అంటే అసలు ఇష్టం లేదు. ఈ వయసులో గిఫ్ట్లు ఏం చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలు టూర్లు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు సీతాదేవికి. భర్త తెచ్చిన సంపాదనని పొదుపుగా వాడుకుని పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి కుటుంబానికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చిన సగటు భారతీయ మహిళ సీతాదేవి. రామారావు గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. మూడు గదుల కొంపలో ముగ్గురు ఆడపిల్లలతో పొదుపుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కష్టపడి జీవితంలో పైకి వచ్చిన వ్యక్తి రామారావు.  రామారావుకి సీతాదేవికి కూడా బంధువులు ఎక్కువ. ఎవరో ఒకరు బంధువులు రామారావు ఇంట్లో విస్తరి వేయని రోజు ఉండదు. అయినప్పటికీ సీతాదేవి ...

బహుమానం

బహుమానo ఉదయం ఐదు గంటలు అయింది. బాలభానుడి దినచర్య మొదలైంది. మా ఇంట్లో కూడా మా ఔషధ సేవ ప్రారంభమైంది.  " వసంత బిపి మందు వేసుకున్నావా! ఆ మాటతో ప్రారంభమైంది మా దినచర్య. " మీరు కూడా వేసుకోండి రోజు మర్చిపోతున్నారు ఈ మధ్య మీకు మతిమరుపు ఎక్కువైంది ఎప్పటిలాగే శ్రీమతి ఆందోళన నా ఆరోగ్యం గురించి.  " ఇదిగోండి మీ షుగర్ మందు. అంటూ మందు చేతులో పెట్టి తను కూడా ఒక టాబ్లెట్ నోట్లో వేసుకుంది. అరగంట పోయిన తర్వాత రెండు గ్లాసులతో రాగి జావా రెండు ప్లేట్లలో రెండేసి ఇడ్లీలు పెట్టి ఎదురుగుండా కూర్చుని టిఫిన్ అయింది అనిపించాము. ఉప్పు పులుపు లేని చట్నీ. చప్పగా ఉంది. అయినా ఇది రుచులు కోరుకునే వయసు కాదు. కడుపు నింపుకునే వయసు.  ఆ తర్వాత ఆవిడ వంటింట్లోకి నేను రీడింగ్ రూమ్ లోకి. నచ్చిన పుస్తకం తీసుకుని వాలు కుర్చీలో కూర్చుని చదువుతూ అలా నిద్రలోకి జారిపోయా. రాత్రి ఎక్కువగా నిద్ర పట్టదు. నాకేం బాధ్యతలు లేవు. ఆలోచనలు లేవు. కడుపుని పుట్టిన పిల్లలు తాతలు కూడా అయిపోయారు.  ఇప్పుడు నాకున్న బెంగ ఒకటే కాలం ఎలా గడుస్తుంది అని. ఎంతసేపు టీవీ చూసినా అవే ఇంటర్వ్యూలు. వృద్ధుల ఆలయాలు ఎంత అందంగా ఉన్నాయో ఎంత సౌకర్యంగ...