పోస్ట్‌లు

ఏప్రిల్ 11, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పాదముద్రలు

పాదముద్రలు మన జీవిత ప్రయాణంలో మనకు ముఖ్యంగా సహకరించేవి మన శరీరంలో అంతర్భాగమైన కాళ్లు మరియు వాటిని అంటిపెట్టుకొని ఉండే పాదాలు.  మన గమనానికి ఇవే ఆధారం. బాల్యంలో అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి అడుగులుకి తడబడే అడుగులకి మన కాళ్ళే మనకు ఆధారం.  కాలం గడిచే కొద్దీ కాళ్లు బలపడతాయి. మనసు కూడా బలపడుతుంది. ఒకప్పుడు అమ్మ ఆసరా అవసరమయ్యే మనల్ని మన కాళ్లు స్నేహితులతో పాఠశాలలకి ఆటపాటలకి తీసుకెళ్తాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కూడా మన అడుగులు ముందుకు పడతాయి. జీవితంలో ఎక్కవలసిన మెట్లు ఎక్కడానికి మనల్ని గమ్యం చేరుస్తూ ఉంటాయి మన కాళ్లు కానీ... పాదాలు మాత్రం ప్రతి అడుగులో ముద్ర వేసిపోతుంటాయి. కాళ్లు మన శరీరాన్ని మోస్తే...పాదాలు మన కదలికల్ని జ్ఞాపకంగా మిగులుస్తాయి. ఎప్పుడో చిన్నప్పటి ఇంటి ప్రాంగణం లో మిగిలిన పాదముద్రలు ఇప్పుడీ వృద్ధాప్యంలో వెతుక్కుంటే కనిపించవు. కానీ మనసులో మాత్రం అవే పాదాలు... మనల్ని వెనక్కి పిలుస్తుంటాయి. కాళ్లు శక్తి కాదు కాదు... ఆశ్రయం. పాదాలు గుర్తు కాదు కాదు... అనుబంధం.ఏదో ఒక రోజు  ఈ కాళ్లు నిలబడలేని స్థితి వస్తుంది. కానీ మనం వేసిన పాదాల దార...

నిత్య కళ్యాణం

నిత్య కళ్యాణం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించు పవిత్ర గోదావరి నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కాకినాడ జిల్లాలోని ఐ పోలవరం మండలంలో ఉన్న మురమళ్ళ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడి ఒకటి. ఇది చూడదగిన ప్రదేశం.   పార్వతి దేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞవాటికను నాశనం చేయడానికి శివుడి అంశతో పుట్టిన వీరభద్ర స్వామి నీ శాంత పరచడానికి భద్రకాళి అమ్మవారు ఒక కన్య రూపంలో వచ్చి స్వామి వివాహం గాంధర్వ వివాహం చేసుకుంటుంది.  ఈ దేవాలయం  ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది. ప్రతినిత్యం పూజలతోపాటు నిత్యం భక్తులకు అన్నదానం ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. పిల్లలకి వివాహాలు ఆలస్యం అవుతుంటే తల్లిదడ్రులు ఈ స్వామికి కళ్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు.  ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే దారిలో ఈ మురమళ్ళ గ్రామం ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. 

అతిధి@అరవై

అతిధి @ అరవై.  సాయంకాలం నాలుగు గంటలు అయింది. నీలిరంగు ఆకాశం హఠాత్తుగా రంగు మారిపోయింది. వరుణ దేవుడు వాయుదేవుడు ఇద్దరూ రంగంలోకి దిగారు. పెద్ద వర్షం కాదు గాని చిన్న చిన్న తుంపర్లతో రహదారంతా తడిసిపోయింది.  ఇంతలో స్కూటర్ వచ్చి ఆగింది . ఎవరబ్బా ఈ వర్షం లో అని తొంగి చూశాడు కుర్చీలో కూర్చున్న ప్రసాద్. స్కూటర్ స్టాండ్ వేస్తూ రామారావు వెనకాల అతను భార్య సుజాత కనబడ్డారు.  వీధిలోకి వెళ్లి ఇద్దర్ని సాదరంగా ఆహ్వానించాడు ప్రసాద్. కుశల ప్రశ్నలు అయిన తర్వాత ప్రసాద్ స్నేహితుడు రామారావు "ఒరేయ్ ప్రసాదు రేపు ఉదయం 9 గంటలకి మా అమ్మాయి శ్రీమంతం నువ్వు మీ ఆవిడ తప్పకుండా రావాలి ! అంటూ చెప్పాడు. కాఫీ టిఫిను భోజనం కూడా అక్కడే అంటూ ఆప్యాయంగా చెప్పాడు రామారావు. "నేనెందుకు రా ఇది ఆడవాళ్ళ ఫంక్షన్ కదా నేనేం చేయను వచ్చి అంటూ పకపక నవ్వేడు ప్రసాద్. "లేదురా నువ్వు తప్పకుండా రావాలి. మీలాంటి దంపతులు వచ్చి మా పిల్లనీ ఆశీర్వదించాలి అంటూ సెంటిమెంట్ గా చెప్పాడు  ఇంతలో రామారావు భార్య సుజాత అన్నయ్య గారు వదిన గారు లేరా ! అని ప్రశ్నించింది . లేదమ్మా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింది అంటూ చెప్పాడు ప్రసాద్. రాత్ర...

మన కథ ఆడనే ప్రారంభం

మన కథ అక్కడే ప్రారంభం. " ఆడదే ఆధారం మన కథ ఆడనే ప్రారంభం అంటూ ఎక్కడో పాట వినిపిస్తోంది. నిజమే ఇది అక్షర సత్యం. మగవాడు ఉనికికి గమనానికి అభివృద్ధికి ఆడదే ఆధారం. ఆమె లేకపోతే బ్రతుకు శూన్యం. ఇది ప్రతి మహిళా దినోత్సవం నాడు చెప్పుకునే మాట కాదు. నిరంతరము తలుచుకోవాల్సిన మాట.  ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టిందని అంటారు. పెరిగి పెద్దయిన తర్వాత ఆ పిల్ల అందచందాలు చూసి కళకళలాడుతూ లక్ష్మీదేవి లా ఉంది అని అంటారు. ఇంటికి ఇల్లాలు అందం. నిజమే ఇల్లాలు లేని ఇల్లు బోసిపోతుంది. వెలవెలబోతుంది. ఇల్లాలు తోటే ఆ ఇంటికి అందం. ఆ కుటుంబానికి ఆనందం. నిజజీవితంలో ఒక కుటుంబంలో ఆమె పాత్రను పరిశీలిస్తే అష్టలక్ష్మి తత్వం కనబడుతుంది. ఆ కుటుంబం కోసం పిల్లల కోసం భర్త కోసం ఆమె పడే శ్రమ వెనుక ఉన్న ఆదర్శ మూర్తులు ఎవరని అడిగితే అష్టలక్ష్మిలు అని నా ఉద్దేశం. ఒక ఇంటికి ఇల్లాలు అందం. ఆ ఇంటిలో ఉండే వారి ఆపదలన్నీ తీర్చడానికి ఆనందంగా ఉంచడానికి ఆమె అహర్నిశలు శ్రమ పడుతూ ఉంటుంది. అందుకే ఆమె చేతులలో ఆ కుటుంబానికి అభయ వరముద్రలు ఉంటాయని అనిపిస్తుంది. ఆమె కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఇకపోతే ఆ ఇల్లు ఎప్పుడు పిల్ల...

గమ్యం తెలియని ప్రయాణం

గమ్యం తెలియని ప్రయాణం ఉదయం 5:10 అయింది  కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అంత ప్రయాణికులతో హడావుడి గా ఉంది. ఇంతలో కాకినాడ నుంచి షిరిడి వెళ్లే ఎక్స్ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ప్రయాణికుల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. అంతవరకు బెంచీల మీద కూర్చున్న జనం ఒక్కసారిగా లేచి సామాన్లు తీసుకుని బోగిల్లోకెక్కి సామాన్లు సర్దుకుంటున్నారు. అందరితోపాటు అక్కడ బెంచ్ మీద కూర్చున్న చిన్ని గాడు కుడి చేతి భుజానికి జోలి సంచి తగిలించుకుని జనరల్ కంపార్ట్మెంట్ లోకి ఎక్కాడు. ఆ బోగి ఎక్కడా ఖాళీ లేదు . విపరీతమైన జనం. అలాగే బాత్రూం దగ్గర ప్రయాణికులను గమనిస్తూ కూర్చున్నాడు. చిన్ని గాడికి వయసు ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది కానీ రైలు ప్రయాణం ఏమీ కొత్త కాదు.  చిన్ని గాడిది గమ్యం తెలియని ప్రయాణం. బతుకుదెరువు కోసమే రైలు ఎక్కుతాడు. అంతెందుకు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న గుడిసెలోనే పుట్టాడు. పుట్టగానే వాడి ఏడుపు రైలు కూతలతో కలిసిపోయింది. ఆడుకోడానికి ఆటస్థలం అదే. పొట్ట నింపే స్థలం కూడా అదే. వర్షం వస్తే తలదాచుకోవడానికి చిన్ని గాడికి తెలిసిన స్థలము అదే.  నాన్న అనే పదం తెలియదు. అన్నీ తానై పెంచింది తల్లి. ...

పిచిక గూడు

పిచిక గూడు ఈ లోకంలో ఏ ప్రాణి కూడా తన గూడు తానే సొంతంగా నిర్మించుకోలే దు. మాట తెలిసిన మానవుడు కూడా అన్నీ ఉండి నిపుణులైన వారి మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఒక్క పక్షి జాతి మాత్రం తన గూడు తానే నిర్మించుకుంటుంది. గూడు ఈ విధంగా ఉండాలని, నిర్మించాలని ఎవరు నేర్పారు ఈ మాటలు రాని పక్షికి. ఒక్క భగవంతుడు తప్పితే ఇంకెవరు చెప్తారు.  ఒక మనిషి ఇల్లు కట్టాలంటే ప్రభుత్వం వారి అనుమతితో పాటు, శాస్త్ర సమ్మతము కూడా అయి ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి. ఆ కలల ప్రకారం తన స్వర్గం నిర్మించుకోవాలని తాపత్రయ పడిపోతుంటాడు. మనిషికి ఆశకి అంతులేకుండా పోయింది. మూడు గదులలో సంసారం చేసే కుటుంబాలు రెండు పడకగదులతో ఇల్లు ఉండాలని అది కాకుండా ఎవరు పడకగది వాళ్ళకు ఉండాలని అది కాకుండా ఆధునిక కాలంలో జనం మెచ్చే విధంగా డూప్లెక్స్ కట్టుకోవాలని ఇలా రోజురోజుకీ మనిషి కోరికల సముద్రంలో కొట్టుకుపోతూ ఉన్నాడు. చివరికి మిగిలేది ఇద్దరే ఆ ఇంట్లో. చివరికి తన స్వర్గాన్ని శుభ్రం చేసుకునే ఓపిక కూడా ఆ మనిషికి ఉండదు.  ఆ పక్షికేముంది చెట్టు కొమ్మ ఉంటే చాలు. చిటారు కొమ్మన మిఠాయి పొట్లంలా గూడు నిర్మించేసుకుంటుంది. ఆ పక్షి జాతి తరతర...

మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మెన్

మరిచిపోలేని మా ఊరి పోస్ట్ మాన్. "న వాబు గారు మాకు ఏమైనా ఉన్నాయా! అంటూఎదురపడిన సైకిల్ మీద తిరిగే ఆ ఆరడుగుల మనిషిని ప్రతిరోజు ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ అదే పలకరింపు. "ఏమీ రాలేదండి అంటూ ఆ వ్యక్తి నవ్వుతూ సమాధానం. రావాల్సింది అందించినప్పుడు తమ ఆనందం కళ్ళల్లో వ్యక్తం చేసేవారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు. అందమైన పంచ కట్టు దానిపైన ఆ కాలంనాటి చొక్కా ,కాళ్లకు చెప్పులు ,చేతిలో ఉత్తరాల కట్ట, సైకిల్ మీద ఊరంతా ఉత్తరాల బట్వాడా. ఎండైనా వానైనా క్రమం తప్పకుండా తన వృత్తి ధర్మం నిర్వర్తించే మా ఊరి తపాలా ఉద్యోగి షేక్ లాల్ సాహెబ్.  మాటవరసకి కాకి చేత కబురు పంపితే చాలు వచ్చి వాలిపోతాం అంటారు. పూర్వకాలంలో ఆ ఊరి నుంచి ఈ ఊరికి సమాచారం పంపించాలంటే రాజుల కాలంలో అయితే వేగుల ద్వారా, పావురాలు ద్వారా కూడా పంపించేవారుట. కాలక్రమేణా బ్రిటిష్ వారి పుణ్యమా అని తంతి తపాలా వ్యవస్థ ఏర్పడింది.  ఒకప్పుడు ఆ ఊరికి పోస్ట్ ఆఫీస్ ఉండేది కాదుట. ఇంతకీ ఆ ఊరి పేరు ఏమిటి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకా వయా యానం పల్లిపాలెం గ్రామం ఆ ఊరి అడ్రస్.ప్రక్కనే ఉన్న ఊరి నుంచి ఉత్తరాలు బట్వాడా చేసేవారుట. ఆ ఊరికి రోడ్డు సౌకర్యం సర...