మన విశాఖ
మన విశాఖ ఉక్కు నగరo కాదు ఉర్రూతలు ఊగించే నగరం విశాలమైన నగరం మనోవికాసానికి సరియగు స్థలం. మన విశాఖ నగరం. విహారయాత్రలకు అనువైన స్థలం ఉక్కు లాంటి పట్టుదల సాగరం లాంటి మనసు నిత్యం అప్పన్న ఆశీర్వాదం కలిమికి కనకమహాలక్ష్మి అండ సంపదలు ఇచ్చే సంపత్ వినాయకుడు విశాఖ వాసులకు అదే అదృష్టం సుందర నగరం మీదుగా జాతీయ రహదారి నడిరేయిలో కూడా నగరం చేర్చే సౌకర్యమే హాయి నాలుగు చక్రాల బండి ఉంటే సరే సరి షికారుకి సాగర తీరాలన్నీ రెఢీ సంపత్ వినాయకుడికి అభిషేకం చేసుకుని కనకమహాలక్ష్మి పూజ ముగించుకుని విహారయాత్ర విజయంగా జరగాలని యారాడ వైపు దారి తీద్దాo. ముచ్చటగా మూడు దిక్కుల కొండలు నాలుగోదిక్కు నీలి రoగు సముద్రం యారాడ సాగర తీర విహారం ప్రతి మనిషికి ఉత్సాహo ఆ సాగరానికి కొండలకి మధ్య అనుబంధం ఆటుపోటులు ఎన్ని వచ్చినా కొండకి కరగని ధైర్యం జలకాలాడే చేప పేరు ధరించి ఆ కొండ తీర్చుకుంది రుణం. కొండ ఎక్కించి నగరవాసులకు చూపుతోంది సాగరమంతా అదే డాల్ఫిన్ నోస్. ఆ సాగర తీరం ఋషులుగా మారుస్తుంది అలలన్నీ పాదాలకు తాకి మనసును అందలం ఎక్కిస్తుంది అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అది రుషులు లేని ఋషికొండ వయస్సుతో నిమిత్తం లేదు పడి లేచే ...