పోస్ట్‌లు

పాదముద్రలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పాదముద్రలు

పాదముద్రలు మన జీవిత ప్రయాణంలో మనకు ముఖ్యంగా సహకరించేవి మన శరీరంలో అంతర్భాగమైన కాళ్లు మరియు వాటిని అంటిపెట్టుకొని ఉండే పాదాలు.  మన గమనానికి ఇవే ఆధారం. బాల్యంలో అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి అడుగులుకి తడబడే అడుగులకి మన కాళ్ళే మనకు ఆధారం.  కాలం గడిచే కొద్దీ కాళ్లు బలపడతాయి. మనసు కూడా బలపడుతుంది. ఒకప్పుడు అమ్మ ఆసరా అవసరమయ్యే మనల్ని మన కాళ్లు స్నేహితులతో పాఠశాలలకి ఆటపాటలకి తీసుకెళ్తాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కూడా మన అడుగులు ముందుకు పడతాయి. జీవితంలో ఎక్కవలసిన మెట్లు ఎక్కడానికి మనల్ని గమ్యం చేరుస్తూ ఉంటాయి మన కాళ్లు కానీ... పాదాలు మాత్రం ప్రతి అడుగులో ముద్ర వేసిపోతుంటాయి. కాళ్లు మన శరీరాన్ని మోస్తే...పాదాలు మన కదలికల్ని జ్ఞాపకంగా మిగులుస్తాయి. ఎప్పుడో చిన్నప్పటి ఇంటి ప్రాంగణం లో మిగిలిన పాదముద్రలు ఇప్పుడీ వృద్ధాప్యంలో వెతుక్కుంటే కనిపించవు. కానీ మనసులో మాత్రం అవే పాదాలు... మనల్ని వెనక్కి పిలుస్తుంటాయి. కాళ్లు శక్తి కాదు కాదు... ఆశ్రయం. పాదాలు గుర్తు కాదు కాదు... అనుబంధం.ఏదో ఒక రోజు  ఈ కాళ్లు నిలబడలేని స్థితి వస్తుంది. కానీ మనం వేసిన పాదాల దార...