జై జవాన్
జై జవాన్ నువ్వు మాకంటే ఎందుకు విభిన్నం లోకానికి తెలియ చెప్పాలన్నదే ప్రయత్నం. తలకి రక్షణ కవచం పెట్టుకోవాలంటే మాకు బద్ధకం కానీ నీ తల మీద కవచం దేశ రక్షణకు ధీర సంకల్పం, ఏడాదికో రెండుసార్లు జెండాకు వందనం చేస్తాం. జెండా కనిపించినప్పుడల్లా గౌరవ వందనం చేస్తూనే ఉంటావు. మా కళ్ళు అడ్డమైనదారులు వెతుక్కుంటాయి. నీ కళ్ళు శత్రువులని ఇట్టే పసిగడతాయి. నిదుర లేదు, అలసట లేదు – నీకు దేశ రక్షణ తపన ఒకటే. మేము సమయం మించి ఏ పని చేయలేం మా రక్షణకి నువ్వు ఉన్నావు అనే ధైర్యం మా చెవులకు వినిపించేవి చెప్పుడు మాటలు శత్రువుల తుపాకీ చప్పుళ్ళు ఎప్పుడూ నీ చెవిలో మారు మ్రోగుతూ ఉంటాయి. ఉదయమే నీ గొంతులో వినిపించేది వందేమాతరం. రేడియోలో వందేమాతర గీతానికి గొంతు కలపని దౌర్భాగ్యం మాది. ప్రకృతి బీభత్సంలో మాకు నువ్వు ఆపద్బాంధవుడివి. బాధితులకు ఆశ్రయిస్తుంది నీ హస్తం యుద్ధంలో శత్రువుల పాలిట భస్మాసుర హస్తం కూడా అదే. నీ చేతులు శత్రువుల రక్తంతో తడిసి...