నామినేషన్ పై తరచుగా అడిగే ప్రశ్నలు
నామినేషన్ వ్యవస్థపై తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నామినేషన్ అంటే ఏమిటి?
జవాబు:
నామినేషన్ అనేది ఖాతాదారుడు తన మరణానంతరం తన డిపాజిట్‌లు లేదా లాకర్‌లోని వస్తువులు ఎవరికి చెందాలో ముందుగా పేర్కొనడం. ఇది హక్కు బదలాయింపు కాదుగానీ, సులభంగా క్లెయిమ్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.
2. నామినేషన్ వేటికి ఇవ్వవచ్చు?
జవాబు:
బ్యాంక్ డిపాజిట్లు (Saving, Fixed, Recurring)
లాకర్లు
సేఫ్ కస్టడీలోని వస్తువులు
ఇన్షూరెన్స్ పాలసీలు
మ్యూచువల్ ఫండ్స్
షేర్లు
NPS లేదా ఇతర పెన్షన్ ఖాతాలు
3. నామినేషన్‌ను ఎవరిమీద ఇవ్వవచ్చు?
జవాబు:
కుటుంబ సభ్యులు
స్నేహితులు
మైనర్‌లకు కూడా ఇవ్వవచ్చు (గార్డియన్ పేరుతో)
భారతీయ పౌరులకే పరిమితం కాదండి; విదేశీయుడైనా నామినీ కావచ్చు.
4. నామినేషన్ ఎన్ని మందికి ఇవ్వవచ్చు?
జవాబు:
Banking Laws Amendment Bill 2024 ప్రకారం, గరిష్టంగా నలుగురికి నామినేషన్ ఇవ్వవచ్చు.
డిపాజిట్‌లకు – Successive లేదా Simultaneous గా
లాకర్‌కి – కేవలం Successive nomination మాత్రమే
5. Successive మరియు Simultaneous నామినేషన్‌ల మధ్య తేడా ఏమిటి?
జవాబు:
Successive: ఒకే సమయంలో ఒకరికి మాత్రమే హక్కు ఉంటుంది; ప్రాధాన్యత క్రమంలో మారుతుంటుంది.
Simultaneous: అందరూ ఒకేసారి హక్కుదారులు; షేర్లను శాతాలుగా పంచాలి (100% మొత్తం).
6. నామినేషన్‌ను అంగీకరించే సంస్థలు ఏమిటి?
జవాబు:
బ్యాంకులు
ఇన్షూరెన్స్ కంపెనీలు
స్టాక్ బ్రోకర్లు
మ్యూచువల్ ఫండ్ సంస్థలు
పెన్షన్ నిధుల సంస్థలు
7. ట్రస్ట్‌కి లేదా ధార్మిక సంస్థకు నామినేషన్ ఇవ్వచ్చా?
జవాబు:
సాధారణంగా, నామినీగా వ్యక్తినే మాత్రమే పేర్కొనాలి.
ట్రస్ట్‌కు లేదా సంస్థకు నామినేషన్ ఇవ్వాలంటే, ఇచ్చట పత్రం (Will) ద్వారా ఆస్తి బదలాయించడం చట్టబద్ధమైన మార్గం.
8. ఒక నామినీ మరణిస్తే ఆయన వాటా ఏమవుతుంది?
జవాబు:
Successive nominationలో తదుపరి నామినీకి హక్కు వస్తుంది.
Simultaneous nominationలో, అతని వాటా నామినీ లేనట్లుగా పరిగణించబడుతుంది.
9. నామినేషన్ లేకపోతే డిపాజిట్ ఎవరికీ ఇస్తారు?
జవాబు:
అప్పుడు ఆ డిపాజిట్‌ను ఖాతాదారుడి చట్టబద్ధ వారసులకు బ్యాంకు ఆమోదించిన ఆధారాలతో (legal heir certificate వంటివి) చెల్లిస్తుంది.
10. నామినేషన్ ఎప్పుడైనా మార్చుకోవచ్చా?
జవాబు:
అవును. ఖాతాదారు జీవితంలో ఎప్పుడైనా కొత్త నామినేషన్‌ను దాఖలు చేసి పాతదాన్ని రద్దు చేయవచ్చు. బ్యాంకులో/సంస్థలో ఫారమ్ పూరించి దాఖలు చేయాల్సి ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి