కర్తవ్యం
కర్తవ్యం " రోజంతా మీకు చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఏమి వినపడదు కనపడదు. చెప్పిన మాట అర్థం చేసుకోరు. నాకు వయసు అయిపోతుంది అంటూ పొద్దున్నే అత్తగారి మీద గట్టి గట్టిగా కేకలు వేస్తున్న పార్వతమ్మ మాటలకి మెలకువ వచ్చింది కోడలు రాజ్యలక్ష్మి కి. పార్వతమ్మ అత్తగారు సుందరమ్మ గారు మంచం పట్టి చాలా రోజులైంది. పాపంఈలోగా పార్వతమ్మ గారి భర్త కూడా చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకు రాజేష్ కి రాజ్యలక్ష్మి ఇచ్చి పెళ్లి చేసి కొత్త కోడల్ని కాపురానికి తీసుకొచ్చి రెండు నెలలు అయింది. ప్రతిరోజు పొద్దున్న ఇదే వరుస. సుందరమ్మ గారిని చూస్తే జాలేస్తోంది రాజ్యలక్ష్మి కి. ఆ లంక అంత కొంపలో ఆ మూల గదిలో ఒక నులక మంచం. ఆ నులక మంచ o మీద సరి అయిన దుప్పటి ఉండదు. సుందరమ్మ శుభ్రమైన బట్ట కట్టుకుని ఎన్ని రోజులైందో. సుందరమ్మ గారి నీ ఆదరించిఅన్నం పెట్టడం చూడలేదు రాజ్యలక్ష్మి. నిజానికి ఆర్థికంగా సుందరమ్మకి లోటు లేదు. ఇంట్లో అందరూ వెండి కంచాలలో భోజనం చేస్తారు. కానీ ఆ సుందరమ్మ కి సత్తు కంచంలో అన్నం కలిపి పెడుతుంది పార్వత మ్మ. ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉండేవి . ...