పోస్ట్‌లు

ఊరి జ్ఞాపకం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మా ఊరి జ్ఞాపకం

చూడ్డానికి క్రికెట్ వీరుడులా, పొట్టిగా గవాస్కర్ లా ఉండేవాడు మా వెంకన్న. ఆ గవాస్కరు ఎప్పుడు చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుంటే, ఈయన నోట్లో పొగాకు చుట్ట, చేతిలో పదమూడు ముక్కల పేక పట్టుకుని ఉండేవాడు. లుంగీ పంచ కట్టుకుని దానిమీద చొక్కా తొడుక్కుని, నోట్లో చుట్ట పెట్టుకుని ఉదయమే లేచి సైకిల్ ఎక్కాడంటే ఏ అరుగుదగ్గర ఆగుతాడో ఎవరికీ తెలిసేది కాదు. అరుగు దగ్గర ఆగాడంటే భాగవతం, భారతం, రామాయణం వినడానికి కాదు. ఈయన పారాయణం వేరే ఉంది. అదే చతుర్ముఖ పారాయణం. అందరూ సంక్రాంతి పండుగకి, పెళ్లిళ్లకి, వేసవి సెలవులకి పేకాట ఆడడం మామూలే ఆ ఊర్లో. కానీ మా వెంకన్న 365 రోజులు అదే ప్రవృత్తి! వృత్తి వ్యవసాయం అంటాడు. ఎప్పుడూ పొలం గట్టు ఎక్కిన పాపాన పోలేదు. తలపాగా చుట్టిన సందర్భం చూడలేదు. “ఏవండీ వెంకన్నగారు ఉన్నారా ఇంట్లో?” అంటూ సంవత్సరంలో ఎప్పుడు ఎవరు అడిగినా, “లేదండి, పేకాటలో ఉన్నారండి” అని ఇంట్లోంచి సమాధానం. అదేదో పెద్ద ఉద్యోగం లాగా చెప్పేవారు. చివరికి ఏ వీధిలో ఉన్నాడు, ఎవరు అరుగు మీద ఉన్నాడు వెతుక్కుని, ఆ వచ్చిన పెద్దమనిషి తన పని పూర్తి చేసుకునేవాడు. ఆ ఊర్లో నాలుగైదు అరుగులు ప్రత్యేకంగా ఈ చతుర్ముఖ పారాయణంకే పెట్టింది ప...