శివరాత్రి
మానవ జీవితం క్షణిక మైనది. ఆ క్షణికమైన జీవితం కోసం నిత్యజీవితంలోఎన్నో పాపాలు చేస్తుంటాడు. పాపము అంటే మనిషిని కత్తితోచంపడం ఒక్కటే కాదు. మానసికంగా భాధించినా అది కూడా పాపమే అవుతుంది. రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. కంటికి కనబడని ఎన్నో లక్షల జీవరాశుల కాళ్ళ కింద పడి నలిగి పోతూ ఉంటాయి. అది కూడా పాపమే. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. తప్పులు చేయడం మానవ సహజం. తప్పులు సరిదిద్దుకోవడం మనిషి లక్షణం. మానవుడు చేసిన తప్పులు అన్నిటికీ భగవంతుడే మార్గం చూపించాడు. భగవంతుని ఆరాధన ఒక్కటే శరణ్యం. ఆ ఆరాధన చేయడానికి కి మంచి రోజులు కూడా దేవుడే చూపించాడు. భారతీయ పండుగలు అన్నీ అలా పుట్టినవే. చాంద్రమానం ప్రకారం చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ప్రతి నెలలో ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. మాఘ మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ శివరాత్రి. ఆరుద్ర నక్షత్రం తో కలిపి వచ్చే మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడు లింగాకారంలో ఉద్భవించాడని శివపార్వతుల కల్యాణం జరిగిందని శివపురాణం చెబుతోంది . శివుడు త్రిమూర్తులలో ఒకరు. ఆది అంతం లేని వాడు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ కాలం నుంచి ఏ కాలానికైనా అవలీలగా పయనించేవాడు . కల్...