పోస్ట్‌లు

మోసం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మోసం

మోసం  అర్ధరాత్రి 12 గంటలు అయింది. అందరూ ఆదమర్చి నిద్రపోయేవేళ ఒక పొట్టిగా ఉండే ఆకారo పంచ కట్టుకుని ఆ పుంతలోనడిచి వెళ్తోంది. ఎవరైనా చూస్తున్నారేమో అని అటు ఇటు చూసుకుంటూ ముందుకు నడుస్తోంది. ఆ ఊరి ప్రజలకు ఇది తెలియని బాగోతం కాదు జుట్టు పట్టుకుని నిలదీద్దాం అంటే ఆయన ఊరికి వంద ఎకరాల మోతుబరి రైతు .పోనీలే వయసులో ఉన్న కుర్రాడు అనుకుంటే కనిపెంచిన అమ్మ బ్రతికే ఉంది కానీ తల మీద నెరిసిన జుట్టు కుర్రాడు అంటే వెక్కిరిస్తుంది. అలా వె డుతూ మధ్యలో కనిపించిన అమ్మవారి గుడి ముందు ఆగి నమస్కారం చేసుకుని సందు తిరిగి కుడి చేతి పక్కనున్న ఇంటి ముందు ఆగింది. రోజు అలవాటు కదా తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఏ ఆకర్షణ లేకుండా ఏ గుమ్మంలోనూ అడుగుపెట్టడు ఈ పెద్దమనిషి. రాజకీయంగా ఎదగాలని చీకట్లో ఓటర్ల కాళ్లు పట్టుకుని చేతిలో పెట్టవలసింది పెట్టి పంచాయతీ పీఠం ఎక్కేసాడు. సరిహద్దు పొలం బక్క రైతు ని అవసరానికి ఆదుకుని వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీలు కట్టి సరిహద్దులు చెరిపేసాడు. కనపడిందంతా నాది అని గర్వంగా చెప్పుకుంటాడు.  మరి ఈ గుమ్మంలో కనపడిన ఆకర్షణ ఏమిటో. ఎవరికీ అర్థం కాదు. పోన...