కవల పిల్లల తల్లి
బిడ్డకు జన్మనివ్వడం ఒక వరం. కవలలు పుట్టడం ఆ వంశం చేసుకున్న పుణ్యం. పురాణాల కాలం నుంచి ఉంది కవలల జననం లవకుశల జన్మ అందుకు సాక్ష్యం. జన్మరీత్యా కవలలు కాకపోయినా అనుబంధంతో అన్న వెంటే ఉన్నాడు లక్ష్మణుడు తరతరాలుగా వీరి నామమే కవల పిల్లలు అందరికీ. రామాయణంలో సీతాదేవి ఊర్మిళ పాత్ర త్యాగ మయం. సీతాదేవి అరణ్యం పాలైతే ఊర్మిళాదేవినీ నిద్రా దేవత పరం కవల పిల్లలు కాకపోయినా భువిలో సీతా ఊర్మిళ నామము కవల పిల్లలు అందరికీ ఆది వైద్యులు అశ్వనీ దేవతలు కూడా కవలపిల్లలు. వీరి అంశతో జన్మించిన వారే నకుల సహదేవులు. ఒకే కాన్పు లిప్తపాటు తేడా ఒకరి తర్వాత ఒకరు ఒకే పోలిక ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎవరు ముందు ఎవరు వెనుక పుట్టించిన బ్రహ్మకే అయోమయం. మత్తులో ఉన్న అమ్మ మాత్రం ఏమి చెప్పగలదు. బ్రహ్మకి అమ్మకి తెలియని సత్యం. అందుకే కవల పిల్లలు అంటే అందరికీ అభిమానం. ఏ ప్రాణి జన్మకైనా అమ్మే కదా ఆధారం. బిడ్డను లాలించి పోషించేది అమ్మ. కవల బిడ్డ అయినా ఒకే బిడ్డ అయినా యధావిధిగా తన ధర్మం నిర్వహించేది అమ్మ. బాధ్యత లోనే కదా తేడా. బాధ్యత అమ్మ సహనాన్ని రెట్టింపు చేస్తుంది. పెదవి విప్పి చెప్పదు ఏ కష్టం. కవల పిల్ల...