పోస్ట్‌లు

నలుపు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నలుపు ◼️◼️

నలుపు సప్త వర్ణాలు దేవుడు సృష్టే. నల్ల రంగు అంటే అందరికీ భయం. నలుపు నాణ్యం ఆశావాదులు అభిప్రాయం. ఉరిమే మేఘం నలుపు కనికరిస్తేనే చినుకు. భూమంతా సస్యశ్యామలం. పంటలతో సౌభిక్షం. అక్షరాలు నేర్పే బోర్డు నలుపు. అది నేర్పే అక్షరాలే విద్యార్థికి మలుపు. రక్తహీనత ఆమడదూరం నల్ల నేరేడు అంటే దానికి భయం. నల్లటి కాటుక కంటికి సోయగం. అగరు బొట్టు కారు నలుపు  ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మాయం. ఆ చుక్క ఉంటేనే పెళ్లి కూతురికి అందం. బుగ్గన చుక్క పెళ్లికూతురు ముస్తాబు. పోతన్న గారి కృష్ణయ్య నల్లనివాడే. ఒకళ్ళ ఇద్దరా పదహారువేల మంది. మనసు దోచిన వాడు. సాక్షాత్తూ దేవదేవుడే నలుపు. నలుపంటే దేనికి అంత భయం. శనీశ్వరుడుకి నలుపు అంటే మక్కువ. సూర్యుడికి నమస్కారం శనీశ్వరుడు అంటే భయం. సూర్యుడి శనీశ్వరుడిది రక్తసంబంధం. ఏలినాటి శని కి చేద్దాం తిలదానం. కోయిల నలుపు అయితేనేం తరతరాలుగా తన రాగం తోటే వసంతం తీసుకు వస్తోంది . వసంతం తోటే ప్రతి వారికి ఉగాది. గాయకులు గొంతుకి కోకిల గొంతు ఉపమాలంకారం. మాట లేదు తీపి రాగమే ఆ గొంతు వరం.     నల్ల జుట్టు మనిషికి అందం అది చూస్తేనే మనిషికి మానసిక ఆనందం. కాకి బావ పిండం తినకపోతే మన...