స్వర్గం
స్వర్గం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అందులో ఉండే వాళ్లు కష్టాలు అనుభవించినప్పటికీ అది వాళ్ళకి స్వర్గసీమే. స్వర్గంలో ఏముంటుందో మనకు తెలియదు. కానీ ఆ ఇల్లు ఆప్యాయత అనురాగం అనుబంధం ప్రేమ కొంచెం కోపం అన్ని రుచి చూపించిన ప్రదేశం. రుచి చూపించడం ఏమిటి సంపూర్ణంగా అనుభవించిన ప్రదేశం. అందుకే ఆ ఊరు వదిలేసి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా మా ఇంటి మీద మమకారం తలుచుకున్నప్పుడల్లా ఉత్సాహం ఈనాటికి ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నాయి.. అది ఆ ఇంటి మహత్యం. ఆ ఇల్లు కట్టిన వాళ్ళ మనసు అటువంటిది. అది ఇటుకలతో కట్టిన ఇల్లు కాదు. ప్రేమ ఆప్యాయత అనుబంధం అనురాగం వీటితో కట్టిన ఇల్లు. ఆకాశ వీధిలో ఆహారం వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్లే పక్షి సాయంకాలానికి ఆ చెట్టు కొమ్మకు చేరినట్లే ప్రతివాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ తమ గూటికి చేరవలసిందే. ఎక్కడా పట్టుమని పది రోజులు ఇల్లు విడిచి ఉండడం అంటే చాలామందికి బెంగ. అది రెండు గదులు ఇల్లు అయినా మైసూర్ ప్యాలెస్ అయిన ఒకటే విధంగా ఉంటుంది మమకారం. ఎందుకంటే అది అలవాటైన ప్రదేశం. ఇంటితో అంత అనుబంధం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సుమారు రెండు పదుల సంఖ్యలో కుటుంబ సభ్యులు ఆనందంగా కాపురం ...