పోస్ట్‌లు

మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

వేసవి రుచుల విందు

 బ్లాగ్ సిరీస్: బాల్యంలో వేసవి – మధుర స్మృతుల సందడి  భాగం 3: వేసవి రుచుల విందు వేసవికాలం అంటే కేవలం సెలవులు మాత్రమే కాదు… అది రుచుల పండుగ కూడా. ముఖ్యంగా పల్లెటూర్లో గడిపే వేసవి రోజులు, మనకు మరచిపోలేని రుచులను అందిస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఎంతగా మండినా, ఆ వేడిని మర్చిపోయేలా చేసే రుచులు గ్రామీణ జీవితంలో దాగి ఉంటాయి. ముఖ్యంగా మామిడి కాలం — వేసవికి అందమైన వరం. మామిడి తోటల్లో స్నేహితులతో కలిసి తిరుగుతూ, చెట్ల నుంచి పడిపోయిన పిందెలను ఏరుకోవడం ఒక ప్రత్యేకమైన సరదా. ఆ పిందెలను ఉప్పు, కారం నంజుకుని తింటే వచ్చే రుచి — అది మాటల్లో చెప్పలేనిది. కాస్త పులుపు, కాస్త కారంపనం కలిసిన ఆ రుచి, బాల్యంలో మాత్రమే ఆస్వాదించగలిగే ఆనందం. ఇంటికి వచ్చాక అమ్మమ్మ చేతిలో పెట్టిన కొత్త ఆవకాయ ముద్ద — అది కేవలం ఒక వంటకం కాదు, ఆమె ప్రేమకు ప్రతీక. ఆవకాయలో ఉండే కారంపనం కంటే, అమ్మమ్మ చూపించే ఆప్యాయత ఎక్కువగా అనిపిస్తుంది. కమ్మగా ఉండే కంది పొడి ముద్దను వేడి అన్నంలో కలిపి తింటే, అది సాధారణ భోజనం కాదు — ఒక అనుభూతి. ఆ ముద్ద గొంతులో దిగుతుంటే, మనసులో ఒక తృప్తి వెల్లివిరుస్తుంది. మధ్యాహ్న భోజనానికి గుమ్మడి ...

వేసవి

 బాల్యంలో వేసవి_ మధురస్మృతుల సందడి భాగం 1 పరీక్షల తర్వాత మొదలయ్యే పండగ వేసవికాలం… ఈ మాట వినగానే ప్రతి ఒక్కరి బాల్యం మనసులో తీయని జ్ఞాపకాలుగా మెదులుతుంది. ముఖ్యంగా పిల్లలకు అయితే వేసవి అనేది ఒక పండుగే. సంవత్సరమంతా ఎదురుచూసే ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం దొరికేది వేసవిలోనే. ప్రతి సంవత్సరం ఆఖరి పరీక్షలతో ఒక పెద్ద బాధ్యత పూర్తవుతుంది. చివరి రోజు పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు కలిగే ఆ హాయిని మాటల్లో చెప్పడం కష్టం. ఇక పుస్తకాలు, బడులు అన్నీ కొంతకాలం దూరం. పేపర్లు దిద్దడంలో మాస్టారు గారు బిజీ అయిపోతారు; బడి తాళాలు ఆయన జేబులోనే విశ్రాంతి తీసుకుంటాయి. అదే సమయంలో పిల్లల మనసుల్లో మాత్రం కొత్త ఉత్సాహం మొదలవుతుంది — “అమ్మమ్మ ఊరికి ఎప్పుడు వెళ్దాం?” అనే ఆత్రుత. బస్తాలు సర్దుకోవడం, అమ్మ చెప్పే సూచనలు వినడం, రైలు లేదా బస్సు ప్రయాణానికి సిద్ధమవడం… ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. అమ్మమ్మ ఊరికి చేరుకున్న క్షణం నుంచి నిజమైన వేసవి మొదలవుతుంది. మనవళ్లు వచ్చారంటే అమ్మమ్మ, తాతయ్యల ఆనందానికి అవధులు ఉండవు. వారి కళ్లల్లో మెరుస్తున్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత — అది ఎక్కడా దొరకని సంపద. వాకిట్లోకి అడుగుపెట్టగానే అమ్మమ్మ...

కావమ్మ కథ

  రాత్రి 8:00 అయింది. ఆకాశంలో పూర్ణచంద్రబింబం ముద్దుగా మెరిసిపోతోంది. ఆ పున్నమి వెలుగులో పుడమి అంతా పులకించిపోతోంది. చెరువు నీరు నిశ్శబ్దంగా ఉండి, ఆ వెన్నెల వెలుగులో పున్నమి చంద్రుడి ప్రతిబింబాన్ని ముద్దాడుతోంది. చెట్ల నీడలు పొడవుగా పడుతూ ఒక రహస్య కథ చెబుతున్నట్టుగా ఉన్నాయి. . ఒక స్త్రీ—నలభై సంవత్సరాలు వయసుంటుందేమో—ఆ చంద్రుడిని చూస్తూ, ఆ వెన్నెల రాత్రి తనకు తోచని రీతిలో అడుగులు వేస్తూ, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ నృత్యం చేస్తోంది. బొట్టు లేని నుదురు, తల మీద వేసుకున్న ముసుగు, బోసిపోయిన చేతులు ఇష్టం వచ్చినట్లు గట్టి గట్టిగా మాట్లాడుతున్న మాటలు విని  వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇద్దరు తమ్ముళ్లు అది చూసి నిట్టూర్చారు. “మా అక్క ఏమైనా తిందా?” అని పెద్ద తమ్ముడు రామారావు తన భార్య సీతమ్మని అడిగాడు. “లేదండి, నోరు అసలు విప్పడం లేదు. దానికి తోడు ఇవాళ ఉదయం నుంచి అలా వాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా ఎంత ప్రయత్నం చేసినా లోపలికి రావడం లేదు,” అంటూ బాధపడుతూ చెప్పింది. మామూలు మనుషుల్లో ఉన్నప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతుంది కావమ్మ. ఆ లోకంలోకి మారిపోయినప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ, గంటల తరబ...

వసంతం చెప్పే జీవన సత్యం

ఆంగ్ల సంవత్సరాది, తెలుగు సంవత్సరాది—రెండూ కాలానికి కొలమానాలే. కానీ వాటి స్వభావం మాత్రం వేరు. ఆంగ్ల సంవత్సరాది గడియారం లాంటిది—సూచీలు తిరుగుతాయి, తేదీలు మారతాయి, కానీ అది యాంత్రికం. మన జీవనంతో, మనసుతో, ప్రకృతితో పెద్దగా సంబంధం లేకుండా కాలాన్ని కొలుస్తుంది. తెలుగు సంవత్సరాది మాత్రం జీవంతో నిండినది. అది గడియారం కాదు… అది ఒక జీవన చక్రం. ప్రకృతి శ్వాసించే ప్రతి క్షణానికీ అది ప్రతిబింబం. శిశిరం తన చివరి ఊపిరి తీసుకుంటున్న వేళ, చెట్లు ఆకులు రాల్చి నిశ్శబ్దంగా నిలబడినప్పుడు, ఒక ముగింపు కనిపిస్తుంది. అయితే అదే ముగింపులో కొత్త ఆరంభం దాగి ఉంటుంది. వసంతం అడుగుపెట్టినప్పుడు, చిగుర్లు మొలుస్తాయి… పూలు వికసిస్తాయి… ప్రకృతి తన నవ్వును తిరిగి పొందుతుంది. ఆ ఆకురాల్చే దశ నుండి మొగ్గ తొడిగే దశకు మారడమే వసంతం. అదే నిజమైన “యుగాది”—యుగానికి ఆది. అందుకే తెలుగు సంవత్సరాది ఒక తేదీ మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమై, జీవితం కొత్తగా మొదలయ్యే క్షణం. అదే మనకు  ఉగాది పండుగ.  ఈ పండగ కేవలం ప్రకృతిలో మార్పు తో  నిశ్శబ్దంగా మన ఇంటిలోనికి వస్తుంది.  హోరెత్తించే మైకులు, అర్ధరాత్రి వరకు బిర్యానీ వాసనలు, బాణస...

మన జాగ్రత్తలో మనం

ఉదయం ఎనిమిది గంటలు అయింది. హాలులో కూర్చుని రామాయణం చదువుకుంటున్న కాంతమ్మగారిని చూసి కోడలు సరోజ, “అత్తయ్య, మరో కప్పు కాఫీ ఇయ్యమంటారా?” అని అడిగింది. “లేదమ్మా, వద్దు. ఇదిగో ఇది అయిన తర్వాత టిఫిన్ తినేస్తాను.” “అది అప్పుడే ఎక్కడ అవుతుంది? ప్రతిరోజు పది గంటల వరకు చదువుకుంటున్నారు. అంతసేపు ఉంటే మీకు నీరసం వస్తుంది,” అని అంది సరోజ. “పరవాలేదు,” అని సమాధానం చెప్పి మళ్లీ రామాయణం చదువుకోవడంలో మునిగిపోయింది కాంతమ్మ. “నువ్వు టిఫిన్ తినేసేయ్. నా గురించి చూడకు,” అంది. ‘అదేమిటి! ఉదయం లేస్తూనే కాఫీ కోసం విలవిల్లాడే ఈ కాంతమ్మ ఈ మధ్య ఇలా తయారవుతోంది ఏమిటి? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఏమీ చెప్పదు…’ అని మనసులో అనుకుంది సరోజ. సరోజ పని అంతా పూర్తి చేసుకుని టిఫిన్ చేసి వచ్చేటప్పటికి కాంతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. “మీకు ఇష్టమని పెసరట్లు వేశాను. అల్లం పచ్చడి కూడా చేశాను,” అని చెప్పినా, మొహంలో ఎలాంటి ఉత్సాహం చూపలేదు కాంతమ్మ. ప్లేట్లో పెట్టిన రెండు పెసరట్లు తిని, చేయి కడిగేసుకుంది. ఎప్పుడూ “నోరు బాగాలేదు… ఏదో ఒక పచ్చడి చెయ్యి” అంటూ చెప్పే కాంతమ్మ, మధ్యాహ్నం భోజనం కూడా ఏమి మాట్లాడకుండా తినేసింది. మొన...

మాటలు రాని స్నేహితుడు

అదొక అందమైన సుందర నగరం. ఒకప్పుడు పదవీ విరమణ చేసిన వాళ్లు, “శేష జీవితం ఇక్కడే గడపాలి రా!” అని అనుకునే వాళ్లు. అంత సౌకర్యవంతమైన నగరం అది. ఆ నగరంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో మా నివాసం. అప్పుడు అది అక్కడక్కడ ఇళ్లు ఉన్న ప్రదేశం. అయితే ఇల్లు దూరంగా ఉన్నా ఇరుగుపొరుగు వాళ్లు కలిసిమెలిసి ఉండేవారు. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం కలవారు. అలాంటి ప్రదేశంలో ఉండడం నాకు భయంగా ఉండేది కాదు. జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మే పెద్ద స్నేహితురాలు. బడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది స్నేహితులు కలుస్తారు. ఆ చిన్న చిన్న స్నేహాల్లోనే మన బాల్యం నవ్వుతుంది. కానీ బడి దాటిన తర్వాత కొన్ని స్నేహాలు కనుమరుగైపోతాయి. కాలం గడుస్తుంటే కొందరు దూరమవుతారు. కళాశాల దాకా కూడా కొనసాగే స్నేహాలు మరికొన్ని. అక్కడ కూడా కొత్త స్నేహాలు కలుస్తాయి. అలా జీవిత ప్రయాణంలో స్నేహాలు మారుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోతాయి. అలాంటి ఊర్లో ఆ అపురూపమైన వీధి నుంచి మెయిన్ రోడ్డు వరకు రావాలంటే ఒక కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో నాకు ఒక ముఖ్యమైన స్నేహ...

సంధ్యా రాగం

“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి. “అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ. రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది. అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు. పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి. పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్...

కోపం

ఒక రోజు ఒక మనిషి బుద్ధుడి దగ్గరకు వచ్చి కోపంతో తిట్టడం ప్రారంభించాడు. అతను చాలా సేపు దూషణలు చేశాడు. బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా విన్నాడు. తర్వాత బుద్ధుడు అడిగాడు: “ఒకవేళ ఎవరో ఒకరికి బహుమతి ఇచ్చారు అనుకోండి. అది వారు తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిదిగా ఉంటుంది?” ఆ మనిషి చెప్పాడు: “ఇచ్చినవారిదే.” అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు: “అలాగే నేను నీ కోపాన్ని స్వీకరించలేదు. అది ఇంకా నీదే.” బోధ: కోపం తీసుకోకపోతే అది మనకు హాని చేయదు.

మైదానంలో మహోత్సాహం

ఆటగాళ్లు మైదానంలో స్వైర విహారమాడగా, బంతి గగనమందు పక్షిలా విహరించె. సిక్సుల సుడిగాలి మైదానమున వీచగా, ప్రేక్షక హృదయములో హర్షధ్వని పొంగె. ఫోర్ల మెరుపులు కళ్ల ముందర మెరవగా, పరుగుల ప్రవాహము స్కోరుబోర్డును నింపె. బౌలర్ల బాణములు వికెట్లు నేలకొరిగె, ప్రత్యర్థి ఆశలు మెల్లగా కరిగె. చివరికి ఆ రేయి జయధ్వని మార్మోగె, భారత జట్టు కీర్తి గగనమున ఎగిసె. — రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

ఆ ఊరు

 ఆ ఊరు మన జీవన యాత్రలో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం. పుట్టినఊరు , చదువు కోసం వెళ్ళిన ఊరు, పొట్ట చేత పట్టుకుని తిరిగే ఊరు, అత్తవారి ఊరు అందులో ముఖ్యమైనవి.  పుట్టిన ఊరు స్వర్గంతో సమానం అంటారు. మనం పుట్టిన ఊరు తలుచుకున్నప్పుడల్లా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు, గడిచిపోయిన బాల్య మధుర స్మృతులు, బంధువులు, స్నేహితులు గుర్తుకు వస్తూనే ఉంటారు. అది సహజమే. పుట్టినప్పటినుంచి ఆ గాలి ఆ నీరు ఆ వాతావరణం ఆ మనుషులు తో మమేకమై కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి. అక్కడ ఉండేది కొద్ది రోజులే కానీ మన జీవితం ఆ కాలేజీ , స్నేహితుల మధ్య తిరుగుతుంది. జీవితంలో ఆ ఊరి పేరు తలుచుకున్నప్పుడల్లా మన విద్యార్థి జీవితం గుర్తుకొస్తుంది. మరి ఉపాధి కోసం మనం వెళ్లిన ఊర్లు జీవితంలో చాలా మధుర జ్ఞాపకాలు మిగులుస్తాయి. కష్టాలు కూడా ఉంటాయి లెండి.ముఖ్యంగా కొన్ని వృత్తుల వాళ్ళు అంటే అక్కడ ఉండే ప్రజలతో సంబంధం ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రజలతో అనుబంధం పెరుగుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు వీరికి నిత్యం అక్కడ ఉండే ప్రజల తోటే మమేకమై పని చేస్తుంటారు.  కానీ మన జీవన సమరంలో మనకి మధ...

జానకమ్మ

ఇల్లంతా పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. పందిట్లో సన్నాయి మోగుతోంది. పెరడంతా పందిళ్లతో, పందిళ్లు తోరణాలతో మెరిసిపోతున్నాయి. బంధువులు ఒక్కొక్కరు రావడం మొదలైంది. వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని ఒక నలభై ఐదు ఏళ్ల స్త్రీ, “రండి… రండి…” అని ఆప్యాయంగా పలకరిస్తూ టిఫిన్ టేబుళ్ల ముందు కూర్చోబెట్టింది. వడ్డన ప్రారంభమైంది. “ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకోండి… మరో వడ వేసుకోండి… మా ఇందుపల్లి వాళ్ల వంటలు చాలా బాగుంటాయి…” అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఇంతలో ఎవరో, “బీరువా తాళాలు ఎక్కడ పెట్టావ్, జానకమ్మ?” అని గట్టిగా అరిస్తుంటే,“ఇదిగో… మీరు పారేస్తారని నేను పట్టుకుని తిరుగుతున్నాను,” అంటూ తాళాలు అందించి మళ్లీ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ టిఫిన్లు పూర్తి చేయడంతో,“టిఫిన్లు పూర్తయ్యాయి… కాఫీలు ఇవ్వండి,” అంటూ వంట బ్రాహ్మణులకు ఆజ్ఞలు జారీ చేసింది.కాఫీలు తాగిన తర్వాత, “ఎదురింటి కరణం గారింట్లో మీ అందరికీ బస ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్దాం, పదండి. మీ సామానంతా మా వాళ్లు తీసుకువస్తారు,” అంటూ ముందుకు దారి తీసింది. అప్పటికే అక్కడ హాలంతా పరుపులు పరిచి ఉన్నాయి. హాలులో ఒక మూల పెద్ద...