పోస్ట్‌లు

పెళ్ళి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

పెళ్లి

ఒకరి కోసం ఒకరు ఒకరి తలపుల్లో ఒకరు. ఒక మంత్రం పెనవేసిన బంధం. ధర్మబద్ధంగా చేసే కాపురం దాంపత్యం. దాంపత్యానికి పునాది పాణిగ్రహణం. కన్యను చేపట్టడం పాణిగ్రహణం. పరమాత్ముడే వరుడు పరమాత్మిక వధువు జరిగేది జగత్ kalyanyam. మామిడిఆకుల తోరణo పందిరికీ అందం వాయు శుద్ధి సైన్స్ చెప్పిన అంతరార్థం. ఫోటోగ్రాఫర్ ఫోకస్ లో గోరింటాకు ప్రథమం  సౌభాగ్య ప్రదమే గోరింటాకు అలంకరణం . నరదృష్టి కి నల్ల రాయి పగులు. పర దృష్టి మరల్చడం భాషికముతో అలంకారం. బుగ్గన చుక్కతో మా చుక్కకి మరింత అందం. అగరు చుక్కతో దిష్టి ఆమడ దూరం. అంకురార్పణ వివాహ ఘట్టం లో తొలిమెట్టు. కళ్యాణానికి ఇది శుభమస్తు శ్రీకారం. నవధాన్యాపు మొలకలా పచ్చగా ఉండాలని పరమార్థం. వర శుద్ది కోసం చేసేది స్నాతకం. ప్రాయశ్చిత్తమే పరమార్థం. గోత్ర ప్రవరలు వల్లించడమే అంతరార్థం. వరుడి కాశీ ప్రయాణం  బావమరిది వాగ్దానం ఆహ్వానితులకు కుఆనందం. తియ్యటి పానకం తో పరిచయాలు , పలకరింపులు ఎదురుసన్నాహం. ఆడబిడ్డ అంటే అర్ధ మొగుడు.  ఆడబిడ్డలకు ఆత్మీయ సత్కారం  పానకం బిందెలతో బిడ్డ పరమానందం. సంప్రదాయము ఇంత సుందరం.  మంగళములు కలుగజేయునది మాంగల్యం. మాంగల్య మునకు అధి...