హరి కథ
సంప్రదాయ హరికథ – భక్తి, వినోదం, విద్య మేళవించిన కళారూపం. భారతీయ సాంస్కృతిక సంపదలో హరికథ ప్రత్యేక స్థానం కలిగిన కళారూపం. ఇది కేవలం ఓ కథ కాదు – ఇది భక్తి, సంగీతం, సంభాషణ, తత్త్వచింతనల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న కళ. శ్రోతల మనస్సులను భక్తి మార్గంలో నడిపించడంతో పాటు, సామాజిక సందేశాలునూ అందించగల ప్రత్యేకత ఈ కళకు ఉంది. హరికథ యొక్క ఉద్భవం "హరి" అంటే భగవంతుడు (విష్ణువు), "కథ" అంటే కథనం. హరికథా సంప్రదాయం పురాణ కాలం నుండీ కొనసాగుతూ వచ్చింది. ఇది ప్రధానంగా భాగవతం, రామాయణం, మహాభారతం వంటి గ్రంధాలనుఆధారంగా కథనం చేస్తుంది. ఈ హరికథ వినడం వలన ఆ కాలంలో చిన్నపిల్లలకు సైతం పురాణ కథలు తెలిసేవి పెద్దలు ఆ కథను తెలిసినవాళ్లయినప్పటికీ ఆ కథలు వినడం వలన పుణ్యం వస్తుందని కచ్చితంగా శ్రోతలుగా మారిపోయేవారు మహానుభావులు తమ జ్ఞానం, భక్తి బోధనలకు ఇది సాధనగా వాడారు. తెలుగులో హరికథ పరంపర తెలుగు భాషలో హరికథను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన ప్రముఖులు చాలామంది ఉన్నారు వారిలో ఆదిభట్ల నారాయణదాసు గారు ప్రముఖులు వారు హరికథను వినోదాత్మకంగా, భక్తి శ్రద్ధతో, విజ్ఞానంతో మిళితం చేసి ప్రజల హృదయాల్లో నిలిపారు హరికథ న...