పోస్ట్‌లు

తప్పదు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తప్పదు మరి

తప్పదు మరి....... " ఏమిటమ్మా ఎప్పుడు చూసినా అలా నీరసంగా ఉంటున్నావు. ఇదివరకులా ఉత్సాహంగా లేవు. ఏమైనా అనారోగ్యమా లేదంటే, అల్లుడు గారితో గొడవలా ,కుటుంబ సమస్యలా పిల్లలు ఇద్దరు కూడా చాలా నీరసపడిపోయారు ఏమిటో చెప్పు అంటూ పార్వతమ్మ పండక్కి వచ్చిన కూతురు సుజాత పక్కలో పడుకుని ఏడుస్తూ అడిగింది.  "ఏమీ లేదమ్మా మామూ లే అని అంది సుజాత. పార్వతమ్మ అందుకు ఒప్పుకోలేదు. నిజం చెప్పు లేకపోతే 'నా మీద ఒట్టే అని గట్టిపట్టు పట్టింది పార్వతమ్మ.  " నేను ఆ ఇంట్లో ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను అమ్మా , ఉదయం లేచిన దగ్గర్నుంచి హడావుడిగా అన్ని పనులు చేసి పెట్టిన ఎప్పుడూ ఆఫీసుకి ఆలస్యంగానే వెళ్ళవలసి వస్తోంది. రోజు మేనేజర్ గారి చివాట్లు తినవలసి వస్తోంది. ఉదయం లేచి అందరికీ కాఫీలు ఇచ్చి టిఫిన్ ,వంట తయారు చేసి బాక్సులు సర్దుకుని అత్తయ్య గారికి మామయ్య గారికి టేబుల్ మీద సర్ది పిల్లల్ని డే కేర్ లో వదిలేసి ఆఫీస్ కి బస్సు ఎక్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడూ 20 నిమిషాలు లేటు అవుతోంది. ఇంట్లో ఎవరు ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. దానికి తోడు అత్తయ్య గారు మామయ్య గారు పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు. అత్తయ్య గారికి నేను ఉద్యోగ...