పోస్ట్‌లు

సీనియర్ సిటిజెన్ లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సీనియర్ సిటిజెన్

సీనియర్ సిటిజన్ ఒక రోజులో పెద్ద మార్పు నిన్నటి వరకు బాధ్యతలకు బందీని. కాలంతో పరిగెత్తే కర్మజీవిని. ఇప్పుడు గాలిలో ఎగిరే పక్షిని. అప్పుడు ఇప్పుడు  కాలమే నాకు సమస్య. అప్పుడు కాలం సరిపోక  ఇప్పుడు కాలం గడవక. ఇదంతా కొత్త లోకం. ఆ లోకమంతా చూపించి పొద్దు గడిపే నా దోస్త్ వీడే. అందంగా చేతిలోకి చేరిపోయి జేబులోకి దూరిపోయి గోల చేస్తూ తన రాకను తెలియజేస్తాడు. ఆ ఊరి కబురుని పొరుగూరి సొగసుని అందరి క్షేమాన్ని అందంగా చూపిస్తాడు. ముఖ పుస్తకమై మురిపిస్తాడు  తల్లిలా సందేహాలు తీరుస్తాడు. కోరితే కోరాగా చిక్కుముడి విప్పుతాడు. WhatsApp కి సాటి లేదనిపించాడు. రోజు మాట్లాడే బొమ్మలు చూపించి బెంగలు తీర్చుతున్నాడు అసలు కన్నా వడ్డీ ముద్దు అంటారు. దాని విన్యాసాలన్నీకి ప్రేక్షకుడిగా మార్చి కాలాన్ని గడిపించేస్తాడు. నేను ఒక మాలోకాన్ని. ఆ దోస్త్ గాడి లోకంలో నేను ఒక నిరక్షరా స్యుడిని నేను అక్షరాలు నేర్పిన వాళ్ళకి శిష్యుడునైపోయాను.  కాల ప్రవాహంలో వాళ్ళ వడిలో  పసిపాపను అయిపోతాను. కాలం కన్నెర్ర చేస్తే  పంచభూతాల్లో కలిసిపోతాను నేను ఎవర్ని ఒక సీనియర్ సిటిజన్ని. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బ...