ఆ ఊరు
ఆ ఊరు. " ఊరు ఎంత మారిపోయింది. శుభ్రమైన తారు రోడ్లు వేశారు. ఒకప్పుడుపూరి పాకలు బంగాళా పెంకుల ఇల్లులు ఉండే వీధులన్నీ అందాలభవంతులతో మెరిసిపోతున్నాయి. ఒకప్పుడు ఆ ఊరికిరావాలంటే గుర్రo బండి లేదంటే ఎడ్ల బండి తప్ప రిక్షా కూడా వచ్చేది కాదు. ప్రతి వేసవి కాలంలో అమ్మ నేను తమ్ముళ్లుఎంతో కష్టపడి ఆ ఊరు వచ్చేవాళ్ళం. వేసవి కాలంలో ఎందుకు వచ్చేవాళ్ళం? అది మా సొంత ఊరు కాదు. మా అమ్మ పుట్టింటి వారి ఊరు. నేను పుట్టిన ఊరు. నా జన్మభూమి అన్నమాట. సెలవులు ఇవ్వగానే తాతయ్య నుండి ఆహ్వానం అందేది. నేను అమ్మ నా నలుగురు తమ్ముళ్లు అందరం కలిసి హైదరాబాదు నుండి వచ్చేవాళ్ళo. పాపం తాతయ్య ఊర్లో కొద్దిగా వ్యవసాయం చేసుకుంటూ సొంత ఇల్లు , ఆవులు గేదెలతో పాల వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు. అంత పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. కానిపాపం ఎనిమిది మంది సంతానం. అందరినీ డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు పేరంటాలు చేశాడు. ఇక వేసవికాలం వచ్చిందంటే కూతుళ్లు కొడుకులుమనవల తోటి ఆ ఇల్లు కళకళలాడిపోయేది. ఆ ఊర్లో ఇంచుమించుగా పెద్ద ఇల్లు మా తాత గారిది అని చెప్పొచ్చు. ఇంటి ముందు పెద్ద పందిరి సంవత్సరం పొడుగునా ఉండేది.గుమ్...