పోస్ట్‌లు

ఆశయం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆశయం

ఆశయం. అందాల రంగురంగుల బల్బుల వెలుగులో ఆ బహుళ అంతస్తుల భవనం మీద అందంగా మెరిసిపోతున్న" పరంధామయ్య నిలయం "అనే పేరు చూసి ఆనందపడిపోయాడు రఘురామయ్య.  ఎన్నో ఏళ్ల కలల ఫలితం. ఎన్నో సంవత్సరాలు వంటరితనంతో బాధపడిన రఘురామయ్య తొమ్మిది కుటుంబాలతో కాపురం ఉంటున్నాడు. వాళ్లు రక్త సంబంధీకులు కాదు. దూరపు బంధువులు మరియు స్నేహితులు. అయినా కావాలని అందర్నీ ఒక చోటుకు చేర్చాడు. పదిమందితో కలిసి ఉండాలని జీవితాశయం. తనకంటూ ఎవరూ తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా కట్టుకున్న భార్య లేకపోయినా ఇవాళ నా వెనుక తొమ్మిదికుటుంబాలు వాళ్ళు ఉన్నారని ఆనందం రఘురామయ్య కళ్ళల్లో కనబడుతోంది ఆ అపార్ట్మెంట్ చూసి. పిల్లలు సందడితో అపార్ట్మెంట్ అంతా కళకళలాడి పోతోంది.   ఒంటరితనం నిజంగా అంత భయంకరమైనది. డబ్బు ఒంటరితన్నాన్ని దూరం చేయలేదు. వ్యసనాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయని చాలామంది దానికి అలవాటు పడతారు. కానీ ఆ కొద్ది సేపే అది తోడు ఇస్తుంది కానీ ఆ తర్వాత మామూలే. ఎవరు ఒంటరితనాన్ని కోరుకోరు.  జీవితంలో ఎవరికి ఏది వ్రాసిపెట్టి ఉంటే అదెలా జరిగిపోతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉంటుంది. ఏది మన ప్రయోజకత్వం కాదు. ఏదో తెలియని శక్తి మనల్ని...