మనసే మందారమైన వేళ
శీర్షిక: మనసే మందారమైన వేళ మనిషిని నడిపించే యంత్రం మనసు మనసే కదా మనిషికి మంచి మిత్రుడు మనసును మించిన శత్రువు కానరాడు. రహదారిలో నడిపించేది మనసు గోదావరిలో ముంచేసేది మనసే. మనసు కోరితే తూచా తప్పకుండా అమలు చేసేది తనువు. మనిషి చేసే కర్మలకి మనసే కదా మూలం. స్పందించే హృదయం ఉంటే మనసున్న వాడని నామకరణం దయగల ప్రభువులని బిరుదులతో సత్కారం. కోరికలతో దహించుకపోయేది మనసు కొండమీద కోతి కోసం పడరాని పాట్లు పడుతుంది తనువు. అందని ద్రాక్ష కోసం అసువులు అర్పిస్తుంది మనసులోనే ఉంది మహత్యం. ఆందోళనకు లొంగని మనసుంటేనే ఆరోగ్యం. మనసే మందారమైన వేళ. తనువు ఆనంద నృత్యం చేస్తుంది. సత్కర్మల వైపు పరుగులు తీస్తుంది. గువ్వలా ఎగిరిపోవాలనిపిస్తుంది మనసే కదా మనిషిని నడిపించే యంత్రం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు. కాకినాడ 9491792279