శ్రీకాకుళం జిల్లా విహారయాత్ర
శ్రీకాకుళం జిల్లా విహారయాత్ర. వేసవి సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది. పిల్లలందరూ టూర్లు పెడదామని ఒకటే గొడవ పెడుతుంటారు. పెద్దలు కూడా ఏదో ఆటవిడుపు కోసం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాకాకుండా మన రాష్ట్రంలోనే(ఆంధ్రప్రదేశ్) చాలా చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలు, సముద్ర తీర ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా కూడా విహారయాత్రలకు అనుకూలమైనదే. ముందుగా మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని విహారయాత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు, సముద్ర తీర ప్రాంతాలు గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ కి ఉత్తర ప్రాంతంలో ఉండే జిల్లా ప్రధాన కేంద్రం. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే ఒక ప్రదేశం. ఈ జిల్లాలో నాగావళి వంశధార నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఆలయాలు, బౌద్ధ చరిత్ర , గ్రామీణ సంస్కృతి ఒకే చోట చూడాలంటే ఈ జిల్లాని మనం తప్పకుండా సందర్శించాలి. శ్రీకాకుళం పట్టణం విశాఖపట్నం విమానాశ్రయానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంత...