ఫోటోలు
ఫోటోలు ప్రతి మనిషి యొక్క బాహ్య సౌందర్యo నిగ్గు తేల్చేది నిలువు టద్దం.అద్దం కేసి మనం చూస్తున్నంత సేపు మన ప్రతిబింబం కనబడుతుంది. మనం పక్కకు తప్పుకోగానే అద్దం తెల్ల మొహం వేస్తుంది. అద్దం దగ్గరికి మనం వెళ్ళినప్పుడే మన ప్రతిబింబం మనం చూసుకోగలం. అలా కాకుండా మనం నిత్యజీవితంలోని ప్రతి చర్య శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఒక జ్ఞాపికల మిగిలిపోయేలా చేసేది ఛాయాచిత్రం. ఒక అందమైన పెట్టె కాంతిని మన మీద ప్రసరింపచేసి మన ప్రతిబింబాన్ని అందంగా తయారు చేసి మన చేతిలో పెడుతుంది. అదే ఫోటో. అద్దంలోని ప్రతిబింబం క్షణికమైనది. ఛాయాచిత్రం శాశ్వతమైనది. తొలి రోజుల్లో ఫోటో తీయించుకోవడం అంటే ఫోటో స్టూడియో కి కంపల్సరిగా వెళ్ళవలసి వచ్చేది. ఒక అందమైన గది, పెద్ద స్టాండ్ తో కెమెరా ,నల్లటి రీలు ఇవి ఉంటే గాని ఆ ఫోటో రెండు మూడు రోజులు కాని బయటకు వచ్చేది కాదు . ఇప్పుడు రీలు పోయి కాంతితో నడిచే కెమెరాలు వచ్చేసాయి.ఇప్పుడు ఛాయా చిత్రకళ రంగంలో కూడా అత్యాధునిక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి వారి చేతుల్లోనూ మన ఇంట్లోనే బుల్లి కెమెరా ఉంటుంది.మాటలు రాని చంటిపిల్ల కూడా ఫోటోలు తీస్తానంటోంది. మన బుల్లి కెమెరా పాపం రోజు ఎన్ని...