పోస్ట్‌లు

దసరా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

దసరా

దసరా  ఎప్పుడో మా పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకువెళ్లే  రిక్షావాడు పదిహేను రోజుల క్రితం బజార్లో కనబడి నమస్కారం పెట్టి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ కనిపించాడు. ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించాను. దానికి సమాధానం లేదు. ఏమిటి సంగతి అని అడిగాను దసరా మామూలు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాడికి సంబంధం లేదు. దసరా మామూలు కోసం నమస్కారం పెట్టి పలకరించాడు. యాభై రూపాయల నోటు తీసి ఇచ్చి నవ్వుతూ వచ్చేసా. నేను నవ్వుకుంటూ వచ్చేసాను కానీ వాడి మొహం లో ఆనందం లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి అయ్యగారు అంటూ అసహనంగా యాభై రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు. సుమారు దసరాకి నెల రోజుల ముందు నుంచి రోజు ఇదే పరిస్థితి. ముఖ పరిచయం ఉన్న ప్రతి వాళ్లు గుడిలో కనబడిన బడిలో కనబడిన షాపింగ్ మాల్ లో కనబడిన హోటల్ లో ఎదురుపడిన చెయ్యి చాచి దసరా మామూలు కోసం నమస్కారం చేసి మామూలు వసూలు చేస్తున్నారు.  ఇంటిదగ్గర రోజు నిత్యం మనకి చాకిరి చేసే పని అమ్మాయి ,చెత్తబుట్ట వాడు మురికి కాలువలు శుభ్రం చేసేవాడు బట్టలు ఉతికే చాకలివాడు పిల్లల బడిలో పనిచేసే పనివారికి ఏడాది కోమారు అడిగితే ఆనందంగా ఇస...

దసరాకు వస్తిమని విసవిసలు పోక

"దసరాకు వస్తిమని విసవిసలు పోక"         మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు.ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు.  మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది.   ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు . శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే ...