ఒక టీ కప్పు ప్రయాణం
ఒక టీ కప్పు ప్రయాణం. నీలగిరి కొండల్లో పుట్టింది. నీలిరంగు కప్పు లో ద్రవమై వచ్చింది. మత్తును వది లించింది. మధుర పానీయమై వెలుగొందింది. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమి?నా పేరు తేనీరు నా మేనిఛాయ బంగారు. నేను లేకపోతే అందరికీ కంగారు. ఉత్సాహానికి ఉల్లాసానికి మారుపేరు తేనీరు.తేనీరు తాగితే మనిషి మానసికస్థితి మారు.తెల్లారి లేచింది మొదలు పొద్దుగూకే వరకు కప్పు మీద కప్పు ఇస్తుంది మన వాడికి ఒక కిక్కు. చుక్క లేకుండా బండి నడవదు అంటాడు ఒకడు.గుటక గుటక లో రుచి చార్మినార్ టీ అంటాడు ఒకడు. పుర్రెకో బుద్ధి మనిషికో రుచి . పూజా పునస్కారాలు మాట దేవుడెరుగు.టీ చుక్క దిగనిదే మంచం దిగడు మానవుడు.ఏ ముహూర్తంలో చైనాలో పుట్టిందో గాని.జగత్తంతా జాడ్యం లా పట్టుకుందీ బంగారం. పొడి తో పాలు పంచదార కలిపితే పంచామృతం.కాస్తంత అల్లం జోడిస్తే అజీర్ణం బహుదూరం.ఆయుర్వేదమే మెచ్చింది అల్లం టీ. కాశ్మీరీయులు మెచ్చింది KAVHA TEA.ఇంకెవరు చెప్తారు గూగుల్ తల్లి చెప్పింది ఈ మాట. గ్రీన్ టీ గుండెకు చేస్తుంది మేలు. అతిధులని సాదరంగా ఆహ్వానిస్తుంది టీ కప్పుతో ప్రతి ఇల్లాలు.ఆరోగ్యానికి కాఫీ వద్దు టీ యే ముద్దు అంటారు డాక్టర్లు. క...