పోస్ట్‌లు

ఆషాడ గోరింట లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఆషాడ గోరింట_ అరచేతిలో కళ_గుండెలో కల

ఆషాడ గోరింట – అరచేతిలో కళ, గుండెలో కల "చందమామ రావే జాబిల్లి రావే" అంటూ ఎంత పిలిచినా చందమామ కిందికి దిగడు. కానీ ఆషాఢం వచ్చిన వెంటనే ఆకాశం నుంచి చుక్కల్ని తీసుకుని అతివల అరచేతిలోకి దిగుతుంది — ఎర్రటి సూర్యుడిలా మెరిసే చందమామగా! తెల్లటి పాలసముద్రంలాంటి అరచేతిలో, చుక్కల మధ్య ఎర్రటి మెరుపుతో మెరిసే గోరింట అద్భుతమయిన దృశ్యాన్ని సృష్టిస్తుంది. చేతి వేళ్ళకు బుట్టల్ని చుట్టేసే ఆ గోరింటాకు ఒక శిల్పంలా ఉంటుంది. ఇది కేవలం అలంకారం కాదు – ఇది సంబరం. ఇది స్త్రీల ఆత్మానందానికి ప్రతీక. ఆషాడం వచ్చినదంటే ఏ వీధి చూసినా, ఏ ఇల్లు చూసినా, అతివల చేతులు, పాదాలు గోరింట అందంతో మెరిసిపోతాయి. చిన్నారి నుండి పెద్దదాకా – ప్రతి స్త్రీ గుండెల్లో గోరింటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోరింట (హెన్నా/మెహందీ) భారతీయ స్త్రీల జీవన విధానంలో ఒక అంతర్భాగం. శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా అలంకరించే ఇది — శుభానికి, శృంగారానికి, ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది ఒక కలల రంగు, ఒక ఆశల ఆకారం. ఆషాడం వచ్చిందంటే పక్కింటి వాళ్ల దగ్గరపడి అయినా చేతులపై గోరింట వేయించుకుంటారు అతివలు. తమ ప్రేమను, బంధాన్ని, శుభాశయాన్ని గోరింట ...

ఆషాడ గోరింట

ఎరువు లేకుండా పండే పంట ఎరువు తెచ్చుకున్నైనా అలంకరించుకునే పంట.  అదే అతివల చేతిపంట  ఆషాడపు గోరింట  నిద్ర చేయని గోరింట పండు మిరపలా పండునంట అతి వల అరచేతిలో చుక్కల చంద్రుడిలా కనపడునంట. మెరిసే చుక్కలు గోరింట ముద్దలై అరచేతిని అలంకరించు నoట ఎర్రగా పండే గోరింట మగని ప్రేమకు చిహ్నం. చుర్రుమనిపించే ఎర్ర మిరపలా పండితే జవరాలి మదిని దోచే మొగుడువస్తాడని నమ్మకం. అరచేతి అలంకరణతో ఊరుకోదు అతివ సాయమడిగి మరీ అలంకరించుకుంటుంది గోరింటతో అరికాళ్ళని. పండిన గోరింట తో మెరిసే జుట్టుకు అలంకారం. వంటివేడిని తగ్గిస్తుంది అని చెప్పింది ఆయుర్వేదం. ఆషాడం రాగానే గోరింట వైపు చూపుతుంది ప్రతి మగువ మొగ్గు. గోరుముద్దలు తినిపించమని మొగుడిని అడగడానికి ఆమెకు లేదు సిగ్గు. అతివలకు అలంకారం అంటే అంత మమకారం. అరచేతులుకు గోరింట అలంకరణ మరింత అందం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.         కాకినాడ 9491792279