పోస్ట్‌లు

ఎవరికి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఎవరికి రుణం

ఎవరికి ఋణo ఉదయం పది గంటలు అయింది. తెల్లటి కారు ఆ వృద్ధుల ఆలయం ముందు ఆగింది. కారులోంచి  బ్యాగ్ పట్టుకుని ఒక యువకుడు ఒక వృద్ధురాలు దిగి తిన్నంగా రిసెప్షనిస్ట్ గదిలోకి తొంగి చూసారు. అప్పటికే రిసెప్షనిస్ట్ చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు. అమ్మా ఇక్కడ కూర్చుoదాము ఖాళీ అయ్యాక వెళ్ళవచ్చు అంటూ గది బయట ఉన్నబల్ల మీద కూర్చున్నారు తల్లి కొడుకు. కొంతసేపటికి జనమంతా బయటకు వచ్చేసారు. అమ్మ నేను వెళ్లి మాట్లాడ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుకొడుకు రఘు.ఆ తల్లి నుండి ఏమి స్పందన లేదు. ఎటో చూస్తూ ఉండిపోయింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగపీలుస్తోంది.మొహం అంతా కందగడ్డలా ఉంది.  నాన్నగారి పోయిన తర్వాత అమ్మ బాగా బెంగపెట్టుకుంది ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా ఉంది. నాన్న బతికున్న  ఉన్నన్నాళ్ళు ఆమెకు ఏ దిగులు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఒంటరి అయిపోయింది. అమెరికా తీసుకెళ్దామంటే ఇద్దరు ఉద్యోగస్తులo. పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లకు అక్కడ తోచదు. ఒంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది.  చాలామంది భార్యలు లాగే తన భార్య కూడా అమ్మ చేత పనులు చేయిస్తుంది. అమ్మ నాన...