పోస్ట్‌లు

ఏప్రిల్ 10, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ మారిపోయింది

అమ్మ మారిపోయింది రాత్రి 9:00 అయింది  డిసెంబర్ నెల కావడం వల్ల చలి వణికించేస్తోంది. టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే వంటింట్లోంచి పరుగు పరుగున వచ్చి ఫోన్ తీసింది రాజ్యలక్ష్మి. హలో అనగానే" అమ్మ ఎలా ఉన్నావ్ అని కొడుకు రంగనాథ్ అడుగుతూ నేను ఎల్లుండి బయలుదేరుతున్నాను సంక్రాంతి పండక్కి.. నెలరోజుల పాటు అక్కడే ఉంటాను. పండగ స్పెషల్ తయారు చేసి రెడీగా పెట్టు. ఇక్కడ పిజ్జాలు బర్గర్లు తిని నోరు చచ్చిపోయింది. వెళ్లేటప్పుడు గోంగూర పచ్చడి స్వీట్లు పట్టుకెళ్తాను అంటూ తన కావాల్సిన లిస్ట్ అంత చిన్నపిల్లల్లో చెప్పడం ప్రారంభించాడు. నాన్న ఎలా ఉన్నారు ?ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి.?పిల్లలు రావటం లేదు. మీ కోడలు కూడా రావట్లేదు. నేనొక్కడినే వస్తున్నా అంటూ కొడుకు చెప్పిన మాటలకి సరేరా జాగ్రత్తగా బయలుదేరిరా అంటూ పిల్లల గురించి కోడలు గురించి కుశల ప్రశ్నలు వేసి ఫోన్ పెట్టేసింది రాజలక్ష్మి. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి సొంత ఊరు కొచ్చి నెలరోజుల పాటు పిల్లలతో భార్యతో ఉంటాడు. అలా ప్రతిఏటా వచ్చినప్పుడల్లా తన కావలసిన పచ్చళ్ళు స్వీట్లు, పొడులు ఆవకాయలు అన్ని తయారు చేయించుకుని పట్టుకెళ్తుంటాడు. పిల్లలకిష్టమని తన భ...

ఇది మోసమా

 ఇది మోసమా  ఉదయం 5 గంటలు అయింది. కార్తీక మాసం కావడంతో ఆలయం ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయి ఉంది. ఏడుకొండలవాడా వెంకటేశా గోవిందా గోవిందా అంటూ గోవింద నామాలతో భక్తులు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ స్వామి దర్శనం కోసం కొంతమంది క్యూలో నిలిచి ఉన్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి దైవ దర్శనం పూర్తి చేసుకుని తమ తమ ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. భక్తుల అరుపులతో కేకలతో ఆ ప్రాంగణం అంతా హడావుడిగా ఉంది. నిజమే అక్కడ ఎవరి హడావుడి వారిది. ఆలయం లోపలికి వెళ్లే వాళ్ళు వచ్చే వాళ్ళతో ముఖ మండపం రద్దీగా ఉంది. ఈ ముఖం మండపం సుమారు 20 అడుగుల వెడల్పు ఉంటుంది పొడవు సుమారు 100 మీటర్లు ఉంటుంది . ముఖమండపం పై కప్పు పైన అందమైన అష్టదళ పద్మాలు చెక్కి ఉన్నాయి. ముఖమండపం గుండా లోపలికి ప్రవేశించినప్పుడు కుడిపక్క ఎడంపక్క అందమైన నల్ల రాతి అరుగులు వాటిపైన గుర్రాలు ఏనుగులు అందమైన దేవత మూర్తులు విగ్రహాలు తో చూడడానికి చాలా అందంగా ఉంది. అవును అది ఎవరి దేవాలయం సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ప్రస్తుతం ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల ఆలయం. ద్వారకుడు అనే మహామునికి చీమల పుట్టలో వెంకటేశ్వర స్...

మాతృ దినోత్సవం

మాతృ దినోత్సవం. " దేవుడు అమ్మని ఎందుకు పుట్టించాడో తెలుసా. అన్నిచోట్ల దేవుడు ఉండలేక. అంటే అమ్మ దేవుడికి ప్రతిరూపం. అమ్మకి మనకి సంబంధం ఎవరు నిర్వచించలేనిది. 9 నెలలు కడుపులోనూ భూమి మీద పడిన తర్వాత అమ్మ కనుమూసే వరకు ఆ బంధం కొనసాగుతూనే ఉంటుంది. బొడ్డు కోసి వేరు చేసినంత మాత్రాన మనకి అమ్మకి ఉన్న సంబంధం తెగిపోదు. అమ్మ మన ఇంట్లో ఉన్న దేవుడు. బాల్యంలో అమ్మానాన్న మనం ఒకటే. రూపాలే వేరు. మనం గట్టిగా ఏడిస్తే అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు. బోసి నవ్వులు నవ్వుతుంటే ఆ నవ్వులు చూసి అమ్మ కళ్ళల్లో వెలుగు. బాల్యంలో మన లాలన పాలన అంతా అమ్మే. నిప్పుకి ,ఉప్పుకి తేడా తెలియదు వాటిని బూచిలా చూపించి దూరంగా ఉంచేది. ఏది తప్పు ఏది ఒప్పు ఉగ్గుపాలతో నేర్పించేది అమ్మ. బంధాలు బంధుత్వాలు మనకు తెలియవు. చూపుడు వేలుతో నాన్నని చూపించేది అమ్మ. నాన్నకు రికమండేషన్ చేసి నాన్నకు తాహతకు మించిన స్కూల్లో చేర్పించేది అమ్మ. నాన్నకి మనకి మధ్య వారధి అమ్మ. తను కొవ్వొత్తి లా కరిగిపోతూ మన బ్రతుకులో వెలుగులు పంచేది అమ్మ . అందుకే అమ్మంటే కనిపించే దైవం అంటూ విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘ ఉపన్యాసమిచ్చి తన సీట్ లో కూర్చున్నాడు ప్రిన్సిపాల్...

ముందు జాగ్రత్త

ముందు జాగ్రత్త  "ఒరేయ్ రెడ్డి ఉదయం లేచి పిఠాపురం పశువుల సంతకు వెళ్లాలి అoటు రామారెడ్డి తన కొడుకు శ్రీనివాసరెడ్డి తోటి మంచం మీద పడుకుంటూ చెప్పాడు. మనకు పశువులు ఎందుకు ?నాన్న పొలాలన్నీ అమ్మేశాముగా అంటూ కొడుకు ప్రశ్నించాడు. లేదు రేపు ఉదయం తప్పకుండా వెళ్లాలి. బస్సు మీద కాదు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోదాం అంటూ సమాధానం ఇచ్చాడు రామారెడ్డి. తండ్రి మనసులో ఉన్న మాట చెప్పలేదు ఎందుకో తెలియదు అయినా తండ్రి మాటంటే శ్రీనివాస రెడ్డికి చాలా గౌరవం. సరే నాన్న తెల్లవారుజామున బయలుదేరుదాం అంటూ ఇద్దరు మంచం మీద వాలేరు. రామారెడ్డి ఒకప్పుడు బాగా చదువుకున్న మోతుబరి రైతు. కాలక్రమేణా పంటలు సరిగా పండక పిల్లల పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఆస్తంతా ఖర్చు అయిపోయింది. రామారెడ్డి దైవభక్తిపరుడు. పూజలు పునస్కారాలు అంటే బాగా ఇష్టం.ఎప్పుడు గుళ్ళుతిరుగుతుంటాడు. ఆ సొంత ఊర్లోనే తన తాతలనాటి కొంపలోకొడుకు కోడలు భార్యతో కాలక్షేపం చేస్తున్నాడు.  పొలాలూ ఉన్న రోజుల్లో ఇంటి వెనక పశువుల పాకలో ఎప్పుడు పది ఆవులు ఉండేవి. ఎద్దుల తోటే వ్యవసాయం చేసేవాడు. ఆ పశువులని నిత్యం దైవంగా పూజించేవాడు. కాలం కలిసి రాక ఆస్తి అంతా పోయింది కానీ ...

భాధ్యత

భాద్యత అర్ధరాత్రి 12 గంటలు అయింది. అందరూ ఆదమర్చి నిద్రపోతున్న వేళ" అమ్మా రమ్య బాత్రూం కి వెళ్ళాలి అంటూ పక్క గదిలోంచి తల్లి పిలుపు వినబడింది. అప్పుడే కునుకు పట్టిన రమ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ లేచి గబగబా పక్క రూములోకి పరిగెత్తింది. చేయవలసిన సహాయం సక్రమంగా చేసి మళ్లీ తన పడక గదిలోకి తిరిగి వస్తుంటే మూడేళ్ల చంటిది ఏడుస్తూ వచ్చింది. దాన్ని ఎత్తుకుని సముదాయించి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రమ్య. ఇవేమీ పట్టనట్లు భర్త సురేష్ గురక పెట్టినట్టు నిద్ర పోతున్నాడు. ఈ లోకంలో తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేది అలారం గడియారం ఒకటే. మనం అనుకున్న సమయానికి మనల్ని నిద్ర లేపడం దాని భాధ్యత .మనం లేచే వరకు అది అలా హోరు పెడుతూనే ఉంటుంది. రాత్రి సరిగా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మంటలు పెడుతున్న తన భుజస్కందాలపై ఉన్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలంటే ప్రతి గృహిణి కాలాన్ని చూసుకుని పరిగెట్టాలి. మూడేళ్ల చంటిపిల్ల , ఉదయం టిఫిన్ చేసి క్యారేజీ పట్టుకుని రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే భర్త బాగోగులు, లేవలేని స్థితిలో మంచం మీద ఉన్న కన్నతల్లి. ఏ బాధ్యత అలక్ష్యం చేసేది కాదు. అన్ని బాధ్యతలు రమ్య వైపు చూపులు...

లక్ష పెన్నులతో పూజ

లక్ష పెన్నుల తో పూజ.  సాధారణంగా దేవుళ్ళని, దేవతలనినిత్యం పువ్వులతో ధూప దీప నైవేద్యాలతో పూజిస్తుంటారు. అది ప్రతి దేవాలయంలోనూ జరిగేదే. తిరుపతి వెంకటేశ్వర స్వామికి అయితే నడిచి ఏడుకొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. తలనీలాలు సమర్పిస్తామని అనుకుంటారు. అయితే తమ కోరికలు తీరితే కొబ్బరికాయలు మ్రొక్కు తీర్చుకుంటామని ఈ స్వామిని వేడుకుంటారు . ఇది ప్రధానమైన మ్రొక్కు ఈ దేవాలయంలో. ఇంతకీ ఆ స్వామి ఎవరు? అంటే కోనసీమ జిల్లా అయినవిల్లి గ్రామంలో ఉండే శ్రీ సిద్ధి వినాయక స్వామి. అయినవిల్లి గ్రామం కాకినాడకి 72 కిలోమీటర్ల దూరంలో అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇది అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయంలో స్వామి దక్షిణాభిముఖుడై కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు.  ప్రతిరోజు జరిగే సాధారణ అర్చనలతోపాటు లక్ష్మీ గణపతి హోమం ,పర్వదినాలలో ప్రత్యేక పూజలు, జరుగుతుంటాయి. ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.  దానికి తోడు ఈ కోనసీమలో చుట్టూ అందమైన గోదావరి ,పచ్చటి చెట్లు ,పిల్ల కాలువలు, కొబ్బరి తోటలు చూడడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య అన్నదానం జరుగు...