పోస్ట్‌లు

ముసలితనం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ముసలితనం

ముసలితనం ఉదయం ఏడు గంటలు అయింది.  ఎప్పుడూ తెల్లవారుజామునే లేచే నాన్న ఇంకా లేవలేదు ఏమిటి. ఒంట్లో ఏమైనా బాగోలేదా ! రాత్రి బాగానే ఉన్నాడు గదిలో చప్పుడు ఏమీ లేదు అనుకుంటూ తండ్రి రామయ్య గదిలోకి అడుగుపెట్టి న శరత్ కి రామయ్య గారు ఇంకా దుప్పటి ముసుగులోనే ఉండడం చూసి దుప్పటి తీసి ఒంటి మీద చెయ్యి వేసాడు. ఒళ్ళు వేడిగా ఉంది. కాలిపోతోంది. వెంటనే నాన్న ధర్మా మీటర్ నోట్లో పెట్టుకో అంటూ కంగారుగా రామయ్య గారిని లేపి ధర్మా మీటర్ నోట్లో పెట్టాడు. 102 జ్వరం. ఏమైంది నాన్న? అంటూ కంగారుగా అడిగా డు. ఏమి లేదురా ఈమధ్య రోజు ఎండకు తట్టుకోలేక రాత్రి పగలు a c వేసుకుని పడుకుంటున్నాను కదా. కాస్త జలుబు చేసి జ్వరం వచ్చింది.  నాకు ఏసీ పడదు కదా! నేను మొహం కడుక్కొని వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళాడు రామయ్య. శరత్ కి చిన్నతనం నుంచి కంగారు ఎక్కువ. భయం. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. పైగా రామయ్య గారికి ఒక్కడే కొడుకు శరత్. తల్లి పోయిన దగ్గర నుంచి తండ్రిని చంటి పిల్లాడిలా చూసుకుంటాడు. అయిందానికి కాని దానికి డాక్టర్ దగ్గరికి బలవంతంగా తీసుకుపోతుంటాడు రామయ్య గారిని. అతి ప్రేమతో చచ్చిపోతున్నారు ఇంట్లో జనం. మావయ్య గారు ఇప...