పోస్ట్‌లు

కోరిక లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కోరిక

కోరిక సాయంకాలం నాలుగు గంటలు అయింది.  కాకినాడలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు అరుపులు కేకలు గోలలు ఈలలతో సందడిగా ఉంది. ఇంతలో ఒక యువ జంట అలా పార్కులో నడుచుకుంటూ వెళుతున్నారు. తెల్లగా బొద్దుగా ఉన్న కుర్రాడు మూడేళ్ల వయసు ఉంటుందేమో ఆ అమ్మాయి కాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఆ అబ్బాయిని చూడగానే ముచ్చటేసింది అమ్మాయికి. వెంటనే ఎత్తుకుని పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ఆ చూపులో ఉన్న అర్థం భర్త రాకేష్ కి అర్థమైంది. ఆ చూపు రాకేష్ కి ఏమీ కొత్త కాదు.  పార్కుకి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు పిల్లవాడు కనపడడం ఆ పిల్లవాడి వేపు భార్య రమ ఆశగా చూడడం లేదంటే ఎత్తుకొని ముద్దాడడం రమ రాకేష్ వేపు ఆశగా చూడడంప్రతిసారి జరుగుతున్నదే. రమ అలా చూసినప్పుడల్లా రాకేష్ గుండెల్లో గునపం గుచ్చినట్లు అవుతుంది. మనసు బాధపడుతుంది. ఇంతలో ఆ చంటి పిల్లాడు తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకు వెళ్లిపోయింది. అవును మన పిల్లవాడు అయితే మన దగ్గరే ఉంటాడు అనుకుని రమ నిట్టూర్చి ఇంటికి వెళదామా అంటూ భర్తను ఉద్దేశించి చెప్పింది. అంటే రమ బాధపడుతోందన్నమాట. చేసేదేమీ లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు.  రాకేష్ ఇంటికి ...

కోరిక

కోరిక అది రద్దీ ఎక్కువగా ఉండే రాజధానినగరంలోని ఒక వీధి లో  ఉండే హోటల్ ప్రాంగణం. సుమారుగా 80 సంవత్సరాల నుండి ఆ హోటల్ అదే వీధిలో ఉంది. భోజనం హోటల్స్ చాలా  ఉంటాయి. కానీ కస్టమర్ల్ని ఆదరించి ఆప్యాయంగా కొసరి  కొసరి వడ్డించి సంతృప్తిగా భోజనం పెట్టే ఆ హోటల్ ఒక్కటే. అందుకే దూరప్రాంతాల నుండి వచ్చినవారు తప్పనిసరిగా ఈ  హోటల్ లో భోజనం చేసి వె డతారు. చక్కగా అరిటాకు వేసి వడ్డించి తెలుగువారి భోజనం పెట్టె ఏకై క భోజనశాల. కమ్మగా వేయించిన కందిపప్పు పప్పులోకి ఒక చిన్న పాత్రలో వేడివేడి నెయ్యి పనసపొట్టు కూర గుత్తి వంకాయ మజ్జిగ పులుసు గోంగూర పచ్చడి గడ్డ పెరుగు  ఆవకాయ దప్పుళo ఆకులో మెరిసిపోతూ ఆకాశంలోని హరి విల్లులా ఉంటాయి. ఆకు చూడగానే నోరూరిపోతుంది. నోట్లో పెట్టుకోగానే చేతులెత్తి మొక్కాకనిపిస్తుంది. అందుకే ఎక్కడ లేని రద్దీ. ఎప్పటిలాగే ఆరోజు కూడా హోటల్ ప్రాంగణం చాలా రద్దీగా  ఉంది. లంచ్ సమయం కావడంతో సీట్లు ఖాళీ లేక కస్టమర్లు  వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. వెయిటర్లు అటు ఇటు  బిజీబిజీగా తిరుగుతూ వచ్చిన కస్టమర్లకు ఏం కావాలో   చూస్తున్నారు. ఆ హోటల్ యజమాని ప్రతి...