పోస్ట్‌లు

మారిన లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మారిన మానవుడు

మారిన మానవుడు అనాదిగా మానవుడు సంఘజీవి. ఒక తీయని పలకరింపుతో పులకరించిపోతాడు. స్నేహం కోసం ప్రాణాలు అర్పిస్తాడు. విద్యార్థి దశలో మొదలైన స్నేహం కడదాకా కొనసాగుతుంది. ఎవరైనా కోరితే సహాయం వెంటనే చేసేవాడు. ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడే వాడు కాదు. మన సంస్కృతి అటువంటిది. మన చరిత్ర అటువంటిది. కర్ణుడు శిబి చక్రవర్తి లాంటి వారు మనకు ఆదర్శం. సంతర్పణలు పూజలు పునస్కారాలు అంటూ పదిమంది ఒకచోట చేరేవారు. కష్టo సుఖం మాట్లాడుకునేవారు. పుణ్య దినాలలో అరుగుల మీద కూర్చుని భజనలతో కాలక్షేపం చేసేవారు. రచ్చబండల దగ్గర పిచ్చా పాటీ మాట్లాడుకునేవారు. అలా మనిషికి మనిషికి ఒక అనుబంధం ఉండేది. ఆప్యాయంగా పలకరించుకునేవారు. మనసు విప్పి మాట్లాడుకునేవారు. మమత పంచుకునేవారు. బంధుత్వాలుపెంచుకునేవారుకష్టసుఖాల్లోపాలుపంచుకునేవారు కానీకాలంమారిందిమనిషిలోమార్పులుచోటుచేసుకున్నాయి.మనిషి ఒంటరివాడైపోతున్నాడు .మనిషి తన చుట్టూ తాను గిరి గీసుకొని బతుకుతున్నాడు. యువతరం అయితే మరీను. ఎవరైనా పలకరిస్తే తప్ప మాట్లాడరు. పక్కనున్న వ్యక్తి గురించి పట్టించుకోరు. ఎదురింటిలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎంతసేపు ఒకే లోకం. ఆ లోకంలోనే మనిషి మాలోకంల...