డాక్టర్
🏥 డాక్టరు 💊 అర్ధరాత్రి 12 గంటలు అయింది. అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చి నిద్ర పట్టక అటు ఇటు మంచం మీద దొర్లుతున్నాడు డాక్టర్ శ్రీనివాస్ ప్రముఖ కార్డియాలజిస్ట్. ఇంతలో వీధిలోంచి అంబులెన్స్ శబ్దం వినిపించింది. ఎవరికి ఎలా ఉందో పాపం! అనుకున్నాడు. రోజు ఎన్నో వేల మందికి గుండె వైద్యం చేసి అంబులెన్సులు సిరంజిలు శతస్కోపులు మందులు ఆపరేషన్ థియేటర్లు ఇంటెన్సు కేర్ యూనిట్లు స్పెషల్ వార్డు మధ్య బతుకుతున్నా , అంబులెన్స్ శబ్దం అంటే డాక్టర్ కైనా భయం అనిపిస్తుంది. అంటే ఎవరో ప్రమాదంలో ఉన్నారని సూచన ఇస్తోందన్నమాట ఆ శబ్దం. రంగరాయ మెడికల్ కాలేజీ డాక్టర్ క్వార్టర్స్ లో కాపురం ఉంటుంన్న డాక్టర్ శ్రీనివాసు కి ఆ అంబులెన్స్ తమ క్వార్టర్స్ లో లో నుంచే వెళ్లడం గమనించాడు కిటికీలోంచి. ఎవరబ్బా. అనుకుంటూ ఆలోచించసాగాడు. ఇంతలో టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగింది. హలో అనగానే అవతల నుంచి క్యాజువాలిటీ డ్యూటీ డాక్టర్ రమేష్ సార్ మన డాక్టర్ శశాంక్ గారికి పెయిన్ వచ్చిందిట. ఇప్పుడు కాజువాలిటీలో ఉన్నారు కండిషన్ సీరియస్ గా ఉంది. సార్ మీరు వెంటనే రావాలి అంటూ గబగబా నాలుగు ముక్కలు చెప్పేసాడు. వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చేయవలసి...