పోస్ట్‌లు

అమ్మ కాదు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అమ్మ కాదు డాక్టరు బొమ్మ

అమ్మ కాదు డాక్టర్ బొమ్మ  ప్రతి స్త్రీకి మాతృత్వం ఒక తీయని వరం. దేవుడు ఒక స్త్రీకి మాత్రమే ఆ వరం ఇచ్చాడు. పశుపక్షాదులలో కూడా జంతువులలో కూడా బిడ్డను కనే అధికారం ఒక్క ఆడజన్మకు మాత్రమే ఉంది. కారణం ప్రకృతి ధర్మం మరియు స్త్రీ సహనమూర్తి. బిడ్డ కడుపులో పడింది దగ్గర్నుంచి అష్ట కష్టాలు పడి నవ మాసాలు మోసి ప్రసవ వేదన అనుభవించి చావుకు దగ్గరగా వెళ్లి ఒక పసి బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ భూమి మీద పడిన దగ్గర్నుంచి అష్ట కష్టాలు పడి తన రక్తాన్నే చనుబాలుగా మార్చి బాలారిష్టాలు దాటించి విద్యాబుద్ధులు చెప్పించి ఒక భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. ఈ విషయంలో తల్లి పాత్ర అమోఘం. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వలన పుట్టే బిడ్డ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.బిడ్డ మానసిక ఆరోగ్యం ,శారీరక ఆరోగ్యం తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర కీలకం.   పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ప్రతి ఇంటిలో అనుభవజ్ఞులైన తాతమ్మలు నానమ్మలు ఉండేవారు. ఒక స్త్రీ గర్భవతి అయిన దగ్గర నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెట్టవలసిన ఆహారము గురించి పదేపదే ఆ పెద్దవాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అయితే కాలం ...