పోస్ట్‌లు

సహనం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సహనం

 సహనం  సాయంత్రం ఎనిమిది గంటలు అయింది .  కార్తీక్ ఇంకా రావట్లేదు ఏమిటి.   ఈపాటికి రోజువచ్చేసేవాడు ఏమైంది అబ్బా అనుకుంటూ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడి కోసం కాలుకాలిన పిల్లిలా గేటు దగ్గర నుంచి ఇంట్లోకి తిరుగుతోంది రమ.  ఫోన్ చేద్దామంటే ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. ఏమైంది  అబ్బా అని ఆందోళన పడుతూ అరుగు మీద కూర్చుంది.   ఇంతలో చేతిలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. ఏదో   తెలియని నెంబరు అయినా ఫోన్ తీసిన వెంటనే హలో అని     వినిపించింది కార్తీక్ గొంతు. ఏరా ఇంకా కాలేజ్ నుంచి రాలేదు   అంటూ గట్టిగా అరిచింది రమ. లేదమ్మా ఇవాళ కాలేజీలో      క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి అని చెప్పాను కదా  నువ్వు మర్చిపోతున్నావు ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత అంటూ అమ్మ నీకో గుడ్ న్యూస్ నేను జెపి మార్గాన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. సంవత్సరానికి 20లక్షల ప్యాకేజీ అని ఆనందంగా చెప్పాడు కార్తీక్. ఒక్కసారి గుండెల్లో దుఃఖం పొంగు కొచ్చింది రమకి. ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు. తమ కష్టాలు గట్టెక్కపోతున్నాయి అంటూ ఆనందంగా దేవుడి పటoముందు రెండ...