పోస్ట్‌లు

ఒక సైనికుడి జీవితం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఒక సైనికుడి జీవితం

  " నీ కొడుకు నరసయ్య అంతా వాళ్ళ నాన్న పోలిక. ఆ ఒడ్డు ఆ పొడుగు అంతా మీ ఆయన పోలికే అంటూ కొడుకు గురించి ఊరి ప్రజలు చెప్తుంటే ఉప్పొంగి పోయేది కావమ్మ. వాడు చేసే అల్లరి గురించి రోజు ఫిర్యాదులు వస్తుంటే తండ్రి లేని బిడ్డ కదా! సరిగా పెంచలేకపోతున్నానేమో అని రోజు మనసులో బాధపడేది నర్సయ్య గురించి. వీడికా చదువు సరిగా రాలేదు. వెనక చూస్తే ఆస్తిపాస్తులు లేవు. వీడి బ్రతుకు ఎలాగ ? అని బాధపడుతూ ఉండేది కొడుకు గురించి కావమ్మ. ప్రతి ఊర్లో కొంతమంది మంచి మంచి సలహాదారులు ఉంటారు. ఆ ఊర్లోని యువకులకి మంచి మంచి సలహాలిస్తూ వాళ్లని మంచి దారిలో పెట్టడం ఆయనకు హాబీ. అలా అచ్యుతరామయ్య కాళ్లు పట్టుకుంది తన కొడుకు గురించి కావమ్మ. ప్రతి వాళ్లు సలహాలిస్తుంటారు కానీ అవి అమలు చేయడానికి సహాయం చేయరు కానీ ఆ ఊరు హై స్కూల్ హెడ్ మాస్టర్ అచ్యుత రామయ్య మాత్రం సొంత ఖర్చులతో పక్కనున్న టౌన్ కి వెళ్లి అప్లికేషన్ తీసుకొచ్చి నరసయ్యని సైన్యంలోకి పంపడానికి అప్లికేషన్ పెట్టించాడు.  సహజంగా సైనికుడికి కావలసిన ప్రాథమిక అర్హతలన్నీ నరసయ్యలో ఉండడంతో నరసయ్య సైనికుడు అయిపోయాడు.  ట్రైనింగ్ పూర్తి చేసుకుని మిలట్రీ డ్రెస్ లో మెరిసిపోతూ ...