కెమెరా వెలుగులో పెళ్లి
మగ పెళ్లి వారి కారులు అందమైన అలంకరణతో కళ్యాణమండపం ముందు ఆగాయి. ముందు సీట్లో కూర్చున్న పెళ్ళికొడుకు, వెనకాల సీట్లో తల్లి తండ్రి, ఇలా మిగతా కార్లలో మిగిలిన పెళ్లి వారు దిగారు. ఆడపిల్ల వారు స్వాగతం పలకడానికి మేళతాళాలతో ముందుకు కదలి వచ్చారు. అందరికంటే ముందుగా నలుగురు వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అక్కడికి చేరుకుని పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తారు. "సార్ రవి గారు కార్ డోర్ పట్టుకుని ఫోజు ఇవ్వండి" అంటూ పెళ్లి కూతురు తండ్రి రవికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. డోర్ పట్టుకుని ఒకటి, పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని ఒకటి – రెండు స్నాప్స్ అయిపోయాయి. ఇంక కాళ్లు కడిగే కార్యక్రమం. సూటు బూటు వేసుకున్న పెళ్ళికొడుకు బూటు విప్పకుండా, కాలికి వేసుకున్న బూట్లను తడిచేత్తోటి తుడిపించారు పెళ్లికూతురు తండ్రి చేత. "రవి గారు ఆ బూట్ల మీద చేయి వేయండి" – ఒక కెమెరా క్లిక్ మంది. "రెడీ వన్ టూ త్రీ... రవి గారు దండ పట్టుకుని ఇలా చూడండి. పెళ్ళికొడుకు గారు మీరు క్రాస్ గా నిలబడండి" అంటూ సూచనలిస్తూ హడావుడిగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియో-ఫోటో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అసలే ...