క్యాలండర్
క్యాలెండర్ ఏ ఇంటిలో చూసిన గోడ మీద అందమైన చిత్రపటాలు లేకపోయినా క్యాలెండర్ మటుకు వేలాడుతూ ఉంటుంది ప్రతి నెలకి ఒక పేజీ కేటాయించి పన్నెండు పేజీలతో ప్రతిరోజు పంచాంగం చూడనవసరం లేకుండా తిధి వార నక్షత్రం వర్జ్యం కరణం యోగం అన్ని ఒకే చోట మనకు చూపిస్తూ మంచి చెడ్డలు చెప్పే క్యాలెండర్ మన దినచర్యలో ఒక ముఖ్యమైన వస్తువు. తిధి వార నక్షత్రాలతో సంబంధం లేదు. మన జీవితాలకు సంబంధించి ఏ ముఖ్యమైన రోజు అయినా అన్నీ తేదీలు తోటే ముడిపడి ఉన్నాయి . పలానా రోజు ఫలానా తేదీ పలానా సంవత్సరం . గవర్నమెంట్ వారు కొలువులో చేరడానికి కొలువు నుండి దిగిపోవడానికి అన్నీ తేదీలే ముఖ్యం . పెళ్లిరోజు కూడా ఫలానా తేదీ అని చెప్తాం అంతేకానీ పలానా తిధినాడు అని చెప్పం. కేవలం పితృ కార్యాలు, పండగలు మాత్రమే తిధుల ప్రకారం జరుపుకుంటాం. ఏ శుభకార్యానికి అయినా ముహూర్తాలు అయితే తిథి వార నక్షత్రం తారాబలం చూసి పెట్టుకుంటాం గానీ అంకెలతో కనిపించే ఆ తేదీలు మన జీవితంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. దేశంలో ఒక ముఖ్య సంఘటన జరిగితే తదుపరి అది మన చరిత్ర పేజీలో ఒక ముఖ్యమైన రోజు అవుతుంది.ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 1947 వ సంవత...