పోస్ట్‌లు

ఉప్మా లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ఇది ఏమి ఉప్మా చెప్మా!

ఇది ఏమి ఉప్మా చెప్మా!  ప్రతిరోజు ఇంటి ఇల్లాలికి అనేక సమస్యలు. ఏమిటా సమస్యలు? ఆర్థిక సమస్యలు కాదు. అల్పాహారం సమస్యలు. పదుగురు మెచ్చే అల్పాహారం చేయాలని తాపత్రయం. అందుకే ప్రతి ఉదయం కాఫీ తాగిన వెంటనే ఇవాళ ఏం టిఫిన్ చేసుకుందాం అoటు పిల్లలు మరియు భర్త మనోగతం తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చెప్పకపోతే మౌనంగా తనకు నచ్చినది తయారు చేసుకుంటుంది. ఇంటి పనులతో అలసిపోయి ఉంటే కాస్తంత ఉప్మా కలియబెట్టి పెట్టేస్తుంది. ఆ అల్పాహారం చూడగానే కుటుంబ సభ్యుల మొహాలు మాడిపోయిన పెసరట్టులా అయిపోతాయి. అయినా తప్పదు మరి. అయితే ఒకటి ఉంది చెయ్యి తిరిగిన ఇల్లాలు చేసిన ఉప్మా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.  ఇప్పుడైతే రకరకాల టిఫిన్లు వచ్చేయ్ గాని ఒకప్పుడు సదరు ఉప్మాయే పెళ్లి వారికి అల్పాహారం. ఆకుపచ్చటి అరిటాకులో నూనెలో తేలియాడుతూ తెల్లగా మెరిసిపోయే ఆ ఉప్మా ఆ పెళ్లి వారికి అమృతమే.ఆ రోజులు కాబట్టి అలా ఉండేది. ఈ రోజుల్లో ఉప్మా చూస్తే తేలికగా చూస్తారు. పెసరట్టు కాంబినేషన్తో అయితే మారు అడుగుతారు. మాట్లాడకుండా తినేస్తారు. అప్పట్లో ఈ ఉప్మాలో పసుపు రంగులో మెరిసిపోయే శనగపప్పు తప్ప ఈ రోజుల్లో లాగ రకరకాల పప్పులు ఉప్మా తో పాటు ఉడికే...