పోస్ట్‌లు

అక్టోబర్ 16, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

దేవుడు వేసిన శిక్ష

దేవుడు వేసిన శిక్ష. ఉదయం 5:30 గంటలయింది. శీతాకాలం కావడంతో జన సంచారం పెద్దగా లేదు.ఎప్పుడు డ్యూటీ కరెక్ట్ గా చేసే బాలభానుడు ప్రపంచానికి వెలుగు చూపి ఆ గోదావరి నదిలో తన అందం చూసుకుంటున్నాడు. ఏరా రాజు బారెడు పొద్దెక్కింది ఇంకా మంచం మీద నుంచి లేవలేదా గోదావరిలోకి వెళ్ళవా అంటూ తల్లి కసిరిన కేకతో మంచం మీద నుంచి బద్దకంగా లేచి దుప్పటి మడతపెట్టి గూట్లో ఉన్న వేప పుల్ల తీసుకుని నోట్లో పెట్టుకుని గోదావరి ఒడ్డుకి  పరిగెత్తాడు. ఏదిక్కు లేకపోతే గోదావరే దిక్కు అంటారు కదా. అలాగే అభాగ్యులందరికీ గోదావరి తీరం కడుపు నింపుతుంది  అలా రాజుకి బ్రతకడానికి ఆ గోదావరి ఆధారం. ఆ గోదావరి తీరంలోని చిన్నపాక లో వారి కాపురం. నిండా పదేళ్లు కూడా ఉండవు. కుటుంబానికి ఆధారం వాడే. ఆ చిన్న వయసులో ఏం పని చేయగలడు అనే ఆలోచన అందరికీ వస్తుంది.  ఇంతకీ గోదావరి రాజు కడుపుఎలా నింపుతోంది. రాజమహేంద్రవరానికి ప్రత్యేక ఆకర్షణ ఈ గోదావరి. ఆ గోదావరి నది మీద నిర్మించిన వారధి మీద రోజు ఎన్నో రైళ్లు అటు ఇటు తిరుగుతుంటాయి.  విజయవాడ వైపు వెళ్లే రైళ్లు విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్లు తప్పనిసరిగా ఈ వారధి దాటే వెళ్లాలి. అందుకే ఈ బ్రిడ్జి...

సీత జీవితం

సీత జీవితం  ఇల్లంతా పెళ్లి సందడితో హడావిడిగా ఉంది. గుమ్మానికి మామిడి తోరణాలు ఆకాశమంత పందిరి హాలంతా డెకరేషన్ చాలా అందంగా ఉంది. అక్కడ హల్దీ కార్యక్రమానికి డ్యాన్సులతో బంధువులంతా బిజీగా ఉన్నారు. పెళ్లికూతురు సీతాదేవి గారిని రెండు చేతులుండా గోరింటాకు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు గోరింటాకు పెట్టించుకునే హడావుడిలో కొందరు డాన్స్ లు హడావిడిలో హాలు అంతా ఆనందంగా ఉంది.  పెళ్లి పెద్దలు ఇద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వథూవరుల వయసు ఎంత ఉంటుందో ఊహించగలరా . ఇద్దరు వృద్ధ దంపతులు . ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు. ఇద్దరు బిడ్డల తల్లి . కడుపున పుట్టిన పిల్లలు తల్లికి పెళ్లి చేయడం మరీ వింతగా ఉంది కదా. వింత కాదండి. ఇంతకీ పెళ్లి వెనుక అసలు కథ ఏమిటి. సీతా దేవి గారు తల్లిదండ్రులకి ఏకైక కుమార్తె. తండ్రి నారాయణ మూర్తి గారు వేద పండితుడు. ఆచార సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. లేక లేక పుట్టిన ఆడపిల్లని చాలా కట్టుబాట్లుతో పద్ధతిగా పెంచాడు. ఆ ఊర్లో ఉండే ప్రాథమిక విద్య తోటి చదువు ఆపించేసి ఇంటి వద్దనే సంస్కృత పాఠాలు పురాణాలు సంగీతం నేర్పించాడు. సీతా దేవి గారు కూడా చాలా...

దసరా పండగ

దసరా  ఎప్పుడో మా పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకువెళ్లే  రిక్షావాడు పదిహేను రోజుల క్రితం బజార్లో కనబడి నమస్కారం పెట్టి నవ్వుతూ చేతులు నలుపుకుంటూ కనిపించాడు. ఎలా ఉన్నావ్ అంటూ ఆప్యాయంగా పలకరించాను. దానికి సమాధానం లేదు. ఏమిటి సంగతి అని అడిగాను దసరా మామూలు అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు. సుమారు ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాడికి సంబంధం లేదు. దసరా మామూలు కోసం నమస్కారం పెట్టి పలకరించాడు. యాభై రూపాయల నోటు తీసి ఇచ్చి నవ్వుతూ వచ్చేసా. నేను నవ్వుకుంటూ వచ్చేసాను కానీ వాడి మొహం లో ఆనందం లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి అయ్యగారు అంటూ అసహనంగా యాభై రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు. సుమారు దసరాకి నెల రోజుల ముందు నుంచి రోజు ఇదే పరిస్థితి. ముఖ పరిచయం ఉన్న ప్రతి వాళ్లు గుడిలో కనబడిన బడిలో కనబడిన షాపింగ్ మాల్ లో కనబడిన హోటల్ లో ఎదురుపడిన చెయ్యి చాచి దసరా మామూలు కోసం నమస్కారం చేసి మామూలు వసూలు చేస్తున్నారు.  ఇంటిదగ్గర రోజు నిత్యం మనకి చాకిరి చేసే పని అమ్మాయి ,చెత్తబుట్ట వాడు మురికి కాలువలు శుభ్రం చేసేవాడు బట్టలు ఉతికే చాకలివాడు పిల్లల బడిలో పనిచేసే పనివారికి ఏడాది కోమారు అడిగితే ఆనందంగా ఇస...

పగటి వేషగాళ్లు

పగటి వేషగాళ్ళు.  " ఏరా పోచయ్య దసరా దగ్గరికి వచ్చేస్తోంది. ఎప్పటిలాగా నువ్వు పులి వేషం వెయ్యాలి. నువ్వు చేసినట్లుగా పులి డాన్స్ ఎవరు చేయలేరు. రోజుకి ఎంత ఇమ్మంటావు?. కచ్చితంగా చెప్పు మనం రేపే బయలుదేరాలి !అంటూ చెప్పిన కాంట్రాక్టర్ రంగయ్య మాటలకి " రోజుకు ఐదు వందలు ఇప్పించండి. రెండు పూటలా భోజనం. సాయంకాలం కాస్త ఒక గ్లాసు మందు. ఖరీదైంది అక్కర్లేదు లెండి. ఎప్పటిలాగా సత్రంలోనే కదా పడుకోవడం అంటూ సమాధానం ఇచ్చిన పోచయ్య మాటలకి రంగయ్య చాలా ఎక్కువ చెబుతున్నావు. ఇదివరకు ఇచ్చినట్లుగా ఇస్తాను అన్నాడు రంగయ్య.  " అయ్యగారు కిట్టటం లేదు. కూలి పనికి వెళ్తే రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు. దానికి తోడు వయస్సు పెరిగిపోతుంది కదా కాళ్ల నొప్పులు మొదలయ్యే యి. దానికి తోడు ఆ ఊరి జనం నేను పులి వేషంలో కనబడితే ఊరికే ఉండనీరు. డాన్స్ చేయమంటారు. అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా కాళీ ఉండదు అంటూ చెప్పాడు పోచయ్య.  సరే రా రేపు రెడీగా ఉండు . ఉదయం బస్సు కే బయలుదేరాలి.  అంటూ చెప్పిన రంగయ్య మాటలకి తల ఊపేడు పోచయ్య. రంగయ్య రాజమండ్రిలో చిన్న చిన్న నటులను సప్లై చేసే కాంట్రాక్టర్ . అలాగే ఒక షాప్ యజమాని కూడ...

సాంబయ్య

సాంబయ్య   శివరాత్రి పండుగ శివ శివ అంటూ గజగజ వణికించే చలిని కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఒక్కసారిగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు.  మనిషి నిలువునా నిలబడితే మునిగిపోయేంత లోతుగా ఉండి ఎప్పుడూ నీళ్లతో ఉండే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉండే పెద్ద కాలువ కి నీళ్లు ఇవ్వడం ఆపేసారు గవర్నమెంట్ వారు. ఈ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీ ముద్దుబిడ్డ.పంటల కాలం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కాలువ నీటితో పనిలేదు. సాధారణంగా గవర్నమెంట్ వారు ఈ వేసవకాలంలో కాలవలకు నీరు ఆపేసి మరమ్మత్తులు చేస్తారు.మామూలుగా పంటల కాలంలో ఆ పచ్చటి పొలాలకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు సరఫరా చేసే ఆ పెద్దకాలవ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని ఒక కుగ్రామం వెళ్ళాలంటే ఆ పెద్ద కాలవ దాటవాల్సిందే.  ఆ పెద్ద కాలువ ఆ పక్క ఈ పక్క పెద్ద గట్లుండి ఆ గట్లు వెంబడి రకరకాల పెద్ద పెద్ద చెట్లు ఉండికాలువ దాటాలంటే చెక్కలతో తయారుచేసిన ఒక బల్లకట్టు ఆధారం. ఆ బల్ల కట్టు నడుపుతూ సాంబయ్య కుటుంబం తరతరాల నుంచి అదే వృత్తిలో జీవిస్తూ ఉండేవారు.  సాధారణంగా ఉదయం ఐదు గంటల నుంచి చీకటి పడే వరకు ఆ బల్లకట్టున...

కన్యాదానం

కన్యాదానం ఉదయం 10 గంటలు అయింది. పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్ ముగించుకుని తీరికగా వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఈనాడు పేపర్లో వచ్చే వరుడు కావలెను ప్రకటనలు చూస్తున్నాడు. ఇంతలో ఒక మూలగా కన్యాదాతలు కావలెను అని ప్రచురించిన ప్రకటన బాగా ఆకర్షించింది.  పరంథా మయ్య గారు ఇదేమిటి చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ ప్రకటన పూర్తిగా చదివాడు.తల్లిదండ్రులు లేని పిల్లకి స్వచ్ఛందంగా కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి దాతలు కావలెను అంటూ మిగిలిన వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. భార్యకు ప్రకటన చూపించి వెంటనే ఆ పేపర్ లో ఇచ్చిన నెంబరుకి కాల్ చేసారు పరంధామయ్య గారు.  హలో అంటూ అవతల నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. తనని తాను పరిచయం చేసుకుని ఎప్పటినుంచో ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని తనకి ఇద్దరు మగ పిల్లలే అని పెద్దబ్బాయి కి మ్యారేజ్ చేశామని రెండో అబ్బాయికి సంబంధం చూస్తున్నామని తన సంగతులు చెప్పుకుంటూ వచ్చారు పరంధామయ్య గారు.  సరేనండీ సాయంకాలం మా ఇంటి కి రండి అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అంటూ తన అడ్రస్సు చెప్పింది. అనుకున్నట్టుగానే సాయంకాలం ఆ అడ్రస్ కి భార్య...