పండుగలో పల్లె_టూరు
పండగలో పల్లె _టూరు "ఊరూ పల్లెటూరు  దీని తీరే అమ్మ తీరు "అంటూ మనవాళ్లు ఈ మధ్యన నా గురించి అందమైన పాట ఒక  చలనచిత్రంలో  చాలా గొప్పగా వ్రాశారు. అప్పటినుంచి  పల్లె  టూరు మొదలైంది. పల్లెటూరు అంటే చుట్టూ అందమైన చెట్లు గలగల పారే సెలయేళ్లు పిల్ల కాలువలు చెరువులు పంట చేలు పాడి పశువులు అందమైన పెంకుటిల్లు విశాలమైన మనసులు ఆత్మీయమైన పలకరింపులు ఇవి నా గుర్తులు  మామూలుగానే నేను చాలా అందంగా ఉంటాను. అందులో సంక్రాంతి పండుగ. పండగ  అందం పల్లెటూర్లోనే కనబడుతుంది.  నా వీధుల్లో ఉండే  ఇళ్ళు తోరణాలతోటి, రంగుల తోటి ,వాకిళ్లు ముగ్గుల తోటి అందంగా మెరిసిపోతూ  వంటగదిలన్నీ పిండి వంటల వాసనలతో నిండిపోతూ  వచ్చే అతిధుల కోసం  ఎదురుచూస్తూ ఉన్నాయి ఏదో  వాహనం  ఆగిన శబ్దం వినబడింది . డోర్ తీసి కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని నలుగురు కుర్రాళ్ళు అందంగా బ్యాగులు భుజాన్ని తగిలించుకుని కారు దిగుతూ కనబడ్డారు. వీళ్ళు ఎవరబ్బా ఆనమాలు తెలియడం లేదు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఇంట్లో తరాలు మారిన నేను మాత్రం మారలేదు కదా.  ఎవరి పిల్లలు వీళ్ళు అని నాలో నేను అనుకుంటూ ఉంటే మన  "ఊరంతా మారిపోయింది అమ్మ ...