పోస్ట్‌లు

వన లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వనభోజనం

ఆదివారం ఉదయం ఆరు గంటలు అయింది. నగరం ఇంకా నిద్ర లేవలేదు. నగర సరిహద్దుల్లో అందమైన తారు రోడ్డు మీద బస్సు దూసుకుపోతోంది. బస్సు అంతా కోలాహలంగా ఉంది. మంచం మీదనుంచి లేవగానే కాఫీ కప్పు పట్టుకునే నరసింహ శాస్త్రి కాలు గాలిని పిల్లిలా బస్సు అంతా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా గంటకు గాని కాఫీ కప్పు చేతిలోకి రాదు. పోనీ ఎక్కడైనా ఆగి కాఫీ తాగుదామంటే నిన్న సాయంకాలం కమ్యూనిటీ మీటింగ్లో రామశాస్త్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చేయ్. “రేపు ఉదయం ఏమీ బయట వస్తువులు తినడానికి వీల్లేదు. అన్నీ మనం స్వయంగా తయారు చేసుకునే ఉదయం కాఫీ దగ్గర నుంచి మధ్యాహ్నం ఫలహారం వరకు. లేదంటే వనభోజనాలనే మాటకు అర్థం లేదు. సాధారణంగా వనభోజనాలంటే బయట హోటల్ కి ఆర్డర్లు ఇచ్చేసి ఎంజాయ్ చేయడం కాదు. మనకు మనమే స్వయంగా తోటలో వండుకుని పదిమందితో హాయిగా చెట్లు కింద అరిటాకులు వేసుకుని తింటే ఆ ఆనందమే వేరు. ఏడాదికి ఒకసారి కదా! అలా చేస్తే ఎంతో తృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది,” అన్నాడు రామశాస్త్రి. అనుకున్న విధంగా ఉదయం ఐదు గంటలకి పెద్ద బస్సు మా కాలనీ పార్కు దగ్గరికి వచ్చి ఆగింది. మగవాళ్లంతా వంట సామాన్లు, ఆట సామాన్లు, స్పీకర్లు, తాటాకు చాపలు,...