మేము ఎందుకు ప్రత్యేకం

మేము ఎందుకు ప్రత్యేకం! అమ్మా ! ఇన్నాళ్ళు నీకు బంగారు కొండ ని. భారత ప్రజలకి కొండంత అండని. ఆపరేషన్ సింధూరిలో శత్రువులపై విజయం సాధించి అసువులు బాసిన వీర సైనికుడిని. ఒక చిత్రకారుడుకి స్ఫూర్తినిచ్చి బొమ్మగా మిగిలిపోయాను. నీ కంట్లో కన్నీళ్లు జీవనదిలా ప్రవహించడానికి కారణమయ్యేను. భరతమాత ముద్దుబిడ్డ గా గుప్పెడు మట్టిలో కలిసిపోయాను. జాతీయ పతాకం కౌగిలించుకున్న నన్ను చూసి దేశమంతా కన్నీరు కార్చింది నీతో పాటుగా. జాలితో కాదు గౌరవంతో. ఎందుకు నేనంటే అంత ప్రత్యేకం. నేను దేశ ప్రధానిని కాదు రాష్ట్రపతిని కూడా కాదు. ఇంతకుముందు వార్తల్లో లేను. కాశ్మీర్ సరిహద్దుల్లో దేశాన్ని కాపలా కాసే సామాన్య సైనికుడిని. అయినా నేను ఎందుకు ప్రత్యేకం? మనం పుట్టినప్పుడే మరణం కూడా మనతో పాటు పుడుతుంది ఎప్పుడూ కాటు వేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది . చనిపోతామని తెలిసే మేము దేశ రక్షణకి సిద్ధమవుతాం. చావు అంటే భయం లేకుండా ముందుకు నడిచే వీర సైనికులo కాబట్టే మేము ప్రత్యేకo. తల మీద టోపీ కాళ్లకు ఇనప బూట్లు భుజానికి వేలాడుతున్న తుపాకీ ప్రత్యేకమైన బట్టలు ఇవన్నీ మాకు ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపునిస్తాయి. ...