పోస్ట్‌లు

నీటిలో లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నీటిలో దేవుడు

నీటిలో దేవుడు ఉదయం ఆరు గంటలయింది  నగరం అంతా మంచు కప్పేసి ఉంది. ఇప్పుడిప్పుడే బద్దకంగా ఒళ్ళు విరుచుకొంటోంది. నగరం అంతా నిశ్శబ్దంగా కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడి నుంచో పెద్ద శబ్దం ,రక్షించండి! రక్షించండి !అని ఎవరివో అరుపులు వినబడ్డాయి చెరువు పక్కన గుడిసెలో మంచం మీద పడుకున్న రాజుకి. ప్రతిరోజు ఇలాంటి అరుపులు మామూలే. ఆ అరుపులు విన్న వెంటనే రాజు ,అతని భార్య మీరా పరుగు పరుగున బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ." ఎవరో పాతికేళ్లు ఉంటాయేమో ఆ అబ్బాయికి చూస్తుండగానే దూకేసాడు! అంటూ చెప్పుకొచ్చారు.   వెంటనే రాజు భార్య మీరా రాజు కేసి చూసింది. ఇది నీ కేసు అన్నట్లుగా !ఏ పక్క నుంచి దూకాడు! అని అడిగాడు రాజు. ఆ ప్రదేశం చూపించారు అక్కడ ఉన్న జనం. రాజు వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకి కొంచెం దూరం ఈత కొట్టి చేతికి దొరికిన కాలును పట్టుకుని చెరువు గట్టుమీదకు తీసుకొచ్చి పొట్ట మీద గట్టిగా నొక్కాడు .  అలా నాలుగు మూడుసార్లు చేయగా తాగిన నీళ్లన్నీ బయటకు వచ్చి పాపం ఆ కుర్రవాడు కళ్ళు తెరిచి బిత్తర చూపులు చూడ సాగాడు .   చుట్టూ ఉన్న జనం నీ పేరేమిటి ?నీది...