పోస్ట్‌లు

ఆగస్టు 31, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

భూమాత కన్నీరు

"అమ్మా పద్మ! నా బంగారు తల్లి కదా, రెండు మాత్రలు వేసుకో. పొద్దున్న టిఫిన్ మాత్రలు కూడా వేసుకోలేదు. ఈ లంచ్ మాత్ర వేసుకో అమ్మా. నీరసం వస్తుంది" అంటూ పద్మ తల్లి నీరజ కూతుర్ని బతిమాలుతోంది. "లేదమ్మా! నాకు ఆకలిగా లేదు. ఆ మాత్రలు వేసుకుంటే కడుపులో ఏదోలా ఉంటోంది. ఆ మాత్రలు చేదుగా ఉంటున్నాయి. వికారంగా ఉంటుంది. నాకు వద్దు" అంటూ ఏమి తినకుండానే స్కూల్‌కి వెళ్ళిపోయింది పద్మ. "ఆకలి చంపుకోడానికి మాత్రలు వేసుకుంటున్నాను కానీ నిత్యం నా పరిస్థితి కూడా ఇదే" అని తనలోతాను అనుకుంది పద్మ తల్లి నీరజ. "అయినా శరీరానికి ఈ మాత్రలు అలవాటు పడటానికి కొద్ది రోజులు పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవడం లేదు" అని అనుకుంది నీరజ. "ఒసేయ్ నీరజా! నాకు ఆ దిక్కుమాలిన మాత్రలు వద్దు. నాకు రెండు ముద్దల మజ్జిగ అన్నం పెట్టు. అసలే నేను రోగానికి మందులు మింగుతున్నాను. దానికి తోడు మళ్ళీ ఈ దిక్కుమాలిన బాధ ఒకటీ! అలవాటైన ప్రాణం... వేళకి రెండు ముద్దలు తినకుండా ఉండలేము. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి దేవుడా! కడుపులోని ఆకలిని చంపడానికి మందులు మింగే స్థితికి వచ్చేసాము...

హల్లులు

1. క క నుంచి పూసె కరుణ, హృదయ తోటలో పరిమళ గంధం॥ కరుణ లేనిదే మానవత్వం శూన్యం ప్రేమలేని మనసు రాయి అవుతుంది॥ 2. ఖ ఖ నుంచి వెలసె ఖ్యాతి, కష్టపడి సాధించిన ఫలం॥ కృషి లేని ఖ్యాతి శూన్యం, నిజమైన మహిమ కృషిలోనే॥ 3. గ గ నుంచి పూసె గుణం, మనిషి గౌరవానికి పునాది॥ గుణములేని విద్య వృథా, గుణమున్నవాడే నిజమైన రత్నం॥ 4. ఘ ఘ నుంచి వినిపించె ఘనత, ధర్మం నిలబెట్టిన గౌరవం॥ అన్యాయం గెలిచిన చోట ఘనత లేదు, ధర్మమే ఇచ్చేది నిజమైన కీర్తి॥ 5. ఙ ఙ నుంచి వెలసె ఙ్ఞానం, చీకటిని పారద్రోలి వెలుగు॥ జ్ఞానం లేని జీవితం అంధకారం, జ్ఞానమే మానవుని నిజమైన బలం॥ 6. చ చ నుంచి మెరిసె చందమామ, బాల్యంలో కలల సఖి॥ చందమామ లేని చిన్నారి గీతం, అనిపించదు తీపి తీయనిదిగా॥ 7. ఛ ఛ నుంచి లభ్యమైందీ ఛత్రం, వానలో ఎండలో రక్షణ॥ ఛత్రం లేనిదే జీవితం కష్టమే, రక్షణతోనే సౌఖ్యం సాధ్యం॥ 8. జ జ నుంచి వెలసె జీవితం, ప్రేమ దయల పరిమళ తోట॥ జీవితం అనేది పంచుకోవడమే, స్వార్థమే అయితే జీవం వెలితి॥ 9. ఝ ఝ నుంచి పారె ఝరులు, గానమై ప్రవహించే నదులు॥ ప్రకృతి గీతం వినిపించే చోట, మనసు మధురంగా మారిపోతుంది॥ 10.  11. ట ట నుంచి మ్రోగె టపాసులు, ఉత్సవ రాగాల మేళం॥ రంగుల కాంతుల సంబరమే...