మావ గారి నాటకం
ఊరంతా దీపావళి సంబరాలతో హడావుడిగా ఉంది. బాణసంచా కాల్పులతో ఊరంతా మారుమోగిపోతో oది."గత సంవత్సరం నాన్న ఎంత హడావుడి చేశాడు దీపావళి నాడు. పిల్లలతో పోటీపడి బాణసంచా కాల్చుకున్నాడు. కొత్త బట్టలు కట్టుకొని చిన్నపిల్లాడి లాగా మతాబులు చిచ్చుబుడ్లు కాకరపువ్వొత్తులు పాము బిళ్ళలు మనవలతో పోటీపడి కాల్చుకున్నాడు. దీపావళి నాడు ఆయన పుట్టినరోజు. పిల్లలు అంటే ఎంత సరదా. ఒక్కరోజు సెలవు ఉన్నా సరే రమ్మని పదేపదే ఫోన్లు. అంత దూరం నుంచి ఏం వస్తాము? నాన్న అంటే లేదమ్మా! పిల్లల సరదా మనమే తీర్చాలంటూ వచ్చేవరకు ప్రాణం తినేసేవాడు. ఇంట్లో అందరికీ బట్టలు, బాణసంచాలు ,పిండి వంటలు ,ఇంటి నిండా దీపాలు ,గుమ్మానికి మావిడాకులు తోరణాలు అన్నీ తనే దగ్గరుండి చూసుకునేవాడు." ఇవన్నీ ఆడవాళ్ళ పనులండి మీకెందుకు మీరు మనవళ్ళతో ఆడుకోండి అని అమ్మంటే కాదు నేను సహాయం చేస్తాను అంటూ అన్నిట్లోనూ ఉండేవాడు.అసలు విషయం అది కాదు ఎక్కడైనా అమ్మ సరిగా చేయదేమో అని అనుమానం. పిల్లలు అంటే ప్రాణం. మరి ఈ ఏడాది దీపావళి కి అప్పుడే మూడు నెలలు అయిపోయింది. తారాజువ్వల హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడు అని సుమతి మనసులో బాధపడుతూ కంటి నుండి జారిన నీళ్లను తుడుచుక...