అయినవిల్లి గణపతి
అయినవిల్లి గణపతి భక్తుడనై నారికేళము సమర్పింప తొండముతో కష్టములను తరిమినావు. రమణీయ కావ్యము రాసిన కరములతో కలములు ఇచ్చి మా కన్నుల పంటను ఆశీర్వదించినావు. గరికతో పూజించిన మా కన్నీటిగాధలన్ని విని గడ్డి పోచ వలె తేలిక చేసినావు మా మనసులని దొరికిన పత్రితో సేవింప సంతృప్తి చెంది దయ చూపినావు మా బతుకుల మీద గణనాయకుడవై జగతికి శోభవై గోదావరి తీర గజానను డ వై వెలసి అయినవిల్లి జనుల ఆరాధ్య దైవమై మొక్కుబడి గణపతిగా విఖ్యాతి కెక్కినావు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279