పోస్ట్‌లు

వీధి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వీధి కుక్కలు

"ఎందుకు మావయ్య గారు, ఆ వీధి కుక్కలకి రోజు అనవసరంగా పనిగట్టుకుని బిస్కెట్లు పెడుతుంటారు? అవి మీద పడి ఎక్కడ కరుస్తాయని భయం మాకు. మీరేమో ప్రతిరోజూ ఇదే పని!" అంటూ కోడలు భారతి కోపంగా అడిగింది మామగారు రాజారావుని. "ఎన్నోసార్లు వద్దని చెప్పాం! అయినా కానీ మీరు మానట్లేరు. రేపటి నుంచి మీరు ఆ తూముల వైపు వెళ్ళకండి. మిమ్మల్ని చూడగానే అవి తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తాయి. మీరేమో జాలిపడి బిస్కెట్లు కొనిపెడుతుంటారు. చంటి పిల్లలకు పెట్టినట్లు ఏమిటో ఈ అలవాటు!" అని విసుక్కుంది రాజారావు కోడలు భారతి. "పైగా ఇది అనవసరం ఖర్చు. నెలాఖరికి ఎంత ఖర్చవుతుందో, మీరైనా లెక్క చూసుకున్నారా!" అని అడిగేసరికి, ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రాజారావుకి. అయినా భారతి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా చెప్పులు వేసుకుని వాకింగ్‌కి వెళ్ళిపోయాడు రాజారావు.  అలా రోడ్డు మీద నడుస్తూ ప్రతిరోజూ వెళ్లే లాల్‌బహుదూర్‌నగర్ రోడ్ నెంబర్ రెండు లో ఉన్న తూముల దగ్గర కూర్చున్నాడు. రాజారావు అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో తోకలు ఊపుకుంటూ పది కుక్కలు రాజారావు చుట్టూ చేరేయి. వచ్చే ముందు భారతి మాట్లాడిన మాటలకి మనసు బాధపడి,...