పోస్ట్‌లు

ఫిబ్రవరి 13, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

పిచ్చుక _ పల్లె జ్ఞాపకo

ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మన పల్లెటూళ్లు. అనుబంధం, ఆప్యాయతలతో నిండిన మనుషుల మధ్య, మాటరాని మూగజీవాల సాన్నిధ్యంలో మనిషి ప్రశాంతమైన జీవితం గడపగలిగే ప్రదేశం పల్లెటూరు. అక్కడ జీవితం కృత్రిమం కాదు — సహజం. ప్రతి ఉదయం ఒక కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. గంప కింద కూస్తున్న కోడి తెల్లవారిందని సంకేతం ఇస్తుంది. పాకలోని లేగదూడ అరుపు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆకాశంలో విహరించే పక్షులు, చెట్టు మీద “కుహూ కుహూ”మని ఆలపించే కోయిల, చుట్టూ నీడనిచ్చే చెట్లు — ఇవన్నీ కలిసి జీవన సంగీతాన్ని సృష్టిస్తాయి. గలగల పారే గోదావరి ప్రవాహం మనసుకు నెమ్మదిని ఇస్తుంది. తూర్పున ఉదయించే బాలభానుడు భూమిని బంగారు వెలుగులతో నింపుతాడు. ఈ సృష్టిలోని ప్రతి జీవరాశి మధ్య మనిషి సహజంగా మమేకమై ఆనందంగా జీవిస్తాడు.  ఇలాంటి వాతావరణం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కొనలేం. ప్రకృతి అంటే కొనుగోలు చేయలేనిది, నిర్మించలేనిది — అది సహజ సిద్ధమైన వరం. దానిని ఆస్వాదించడమే మన అదృష్టం. అలాంటి మన ఊరిలో, మన ఇంటి చూరులో, ఇంటి ముందు ఉన్న తాటాకు పందిరిలో, పచ్చటి చెట్టు కొమ్మమీద గూడు కట్టుకుని నిత్యం “కిచకిచ”మని శబ్దం చేస్తూ, గోధుమరంగులో మెరిసిపోతూ నేలపై ఉ...