పోస్ట్‌లు

భాగ్యనగరం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భాగ్యనగరం

భాగ్య నగరం  అది నిజంగా భాగ్యనగరమే పట్టా పుచ్చుకుని పట్నం చేరిన  తమ్ములను చెల్లెళ్లను కార్పొరేట్ ఏసీ గదుల్లో మెదడుకు మేత పెట్టి  జేబులు నింపి అన్నపూర్ణలా ఆదరిస్తోంది. అక్షయపాత్రలా ఆహ్వానిస్తోంది. వారాంతపు సెలవుల్లో ఊరికి దూరంగా ఉండి ఉర్రూతలూగిస్తున్న రామోజీ ఫిలిం సిటీ చూపిస్తుంది. నాలుగు స్తంభాల నగిషి చూపించి నవాబు గారి గొప్పతనాన్ని గుర్తుచేసి చౌడి బజార్ అంతా తిప్పి చంటి దానికి  గాజులు కొనిపిస్తుంది. ఆ భాగ్యమతి నగరానికి నిజంగా ఆ ప్రదేశం ఎంతో సుందరం భాగ్యనగరవాసులు కట్టుకున్న బంగారు సరస్సు హుస్సేన్ సాగరo అందాల సరస్సులో ఎగిసిపడే కెరటాలు యువ ప్రేమికులకి ఉత్సాహాన్ని, మధ్యలో ఉన్న గౌతమ్ బుద్ధుడు వయసు మళ్ళిన వాళ్లకి జ్ఞానోదయాన్ని, కలిగించే అందమైన ప్రదేశం. పేరుకే పాత నగరం నేటి తరం వారు కట్టలేని కట్టడాలు మచ్చుకి నిజాం నవాబు గారి  చౌమహల్లా ప్యాలెస్. చూడగానే ఆహా అనిపిస్తుంది  మదిని దోచేస్తుంది బొమ్మలంటే పిల్లలు ఇష్టపడతారు పెద్దలకు కూడా ఇష్టమే పైకి చెప్పరు బొమ్మలు తోటి విన్యాసాలు వండర్లన్నీ చూపించే wonderland రెక్కలున్న విమానమే గాల్లో ఎగురుతుంటే ఆశ్చర్యంగా పైకి చూస్త...